ఎంపిగారి కాళ్లు కడిగి…ఆ నీటిని సేవించి…!

రాజకీయాల్లో వ్యక్తిగత పూజ రానురానూ తారాస్థాయికి చేరుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న కాలంలో…అన్నాడిఎంకే పార్టీ నేతలు వరుసకట్టి ఆమెకు పాదాభివందనం చేసేవారు. ఆమె వంద అడుగుల దూరంలో ఉండగా…ఇక్కడి నుంచే వొంగిపోయి నడిచేవాళ్లు. జయలలిత ఏనాడూ దీన్ని తిరస్కరించిన దాఖలాలు లేవు. ఆమె కూడా సంతోషంగా కాళ్లు మొక్కించుకునేవాళ్లు. అటువంటి సంస్కృతి రానురానూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో కాళ్లు మొక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….

బిజెపికి చెందిన ఓ ఎంపి విషయంలో…ఈ వ్యక్తిపూజ పరాకాష్టకు చేరింది. ఎంపి కాళ్లు కడిని, ఆ నీటిని తాగాడు ఓ అభిమాన ప్రభుద్ధుడు. జార్ఖండ్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే…గొడ్డా అనే ఊర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త….పళ్లెం, నీళ్లు వేదికపైకి తెచ్చారు. ఎంపిగారు కాళ్లు పళ్లెంలో పెట్టి నీటితో కడిగారు. ఆపై వస్త్రం తీసుకుని కాళ్లను తుడిచారు. చివరిగా పళ్లెంలోని నీటిని తీర్థంలా సేవించారు. దీన్నిచూసి జనం విస్తుపోయారు. ఆ ఎంపి గారు కూడా ఈ పాదపూజకు చాలా బాగా సహకరించారు. ఏం చేద్దాం…పిచ్చి ముదిరితే ఇలాగేవుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*