ఎగ్జిట్ పోల్స్ రివర్స్ లో వచ్చివుంటే…?

ఎపిలో అధికార పార్టీ దానికి పోటీ కాళ్ళుగా వున్న మీడియా ప్రధానంగా టివి ఛానెల్స్ చేస్తున్న హడావుడి, ఇంకా చెప్పాలంటే వీరి ఏడుపు దుఃఖాలు, దీనికి తోడు రాజకీయ విశ్లేషకులుగా చలామణి అవుతున్న వారి వాదనలు వింటుంటే… చూస్తుంటే…రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీరి వీరతాళ్లు చూచి వీరికంతా చావు తెలివి వచ్చిందని భావిస్తున్నారు.

రేపు ఎన్నికల ఫలితాలు ఏలా వుంటాయో కాస్తా పక్కన పెడితే రెండు రోజుల్లో తేలిపోనున్న ఫలితాల గురించి ఇంత హడావుడి ఎందుకని సాధారణ ఓటరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు మీడియా దాన్ని ఆశ్రయించుకొనే కొందరు మేధావులు వ్యవహార సరళి శృతిమించి రాగానే పడింది. లేని పోని పెడర్థాలు తీస్తున్నారు. శాస్త్రీయత గల విధానాన్ని అవసరార్థం విమర్శలపాలు చేస్తున్నారు. ఈ దేశంలోనే కాదు. ప్రపంచం మొత్తం మీద వున్న పద్దతిని వక్రీకరించుతున్నారు. అదీ ప్రస్తుతం అవసరం కోసరమే.

ఎగ్జిట్ పోల్స్ గురించి ఆయా రాజకీయ పార్టీలు స్పందించడం తప్పుపట్ట లేం. వారికి జీన్మరణ సమస్య కాబట్టి. కాని మీడియా వ్యవహరించుతున్న తీరు, టివి చర్చలు సారాంశం పరిశీలించితే కందకు లేని దురద కత్తి పీట పట్టుకొన్నట్ల వుంది.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుల తడకలని, వీటికి శాస్తీయత లేదని, ఇంకా ఏవేవో ఆపాదించుతున్న టిడిపి నేతలు… వారికి పోటీ కాళ్ళుగా వున్న మీడియా ఇంకా అందరు కూడా ఒక వేళ రాష్ట్రంలో టిడిపి స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మెజారిటీ సాధించుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చి వుంటే ఈ రాష్ట్రంలో వాతావరణం ఏలా వుండేది? ఈ ప్రశ్ననే నేడు సామాన్య ఓటరు వేసుకుంటున్నాడు. టిడిపి గెలుపొందుతుందని వచ్చివుంటే ఎపిలో ఎగ్జిట్ పోల్స్ కు శాస్తీయత లేదని టివి ఛానెల్స్ చర్చలు పెడుతాయా? టిడిపి నేతలు వైఖరి ఏలా వుండేది? పాపులర్ మీడియాగా చెప్పుకొనే పత్రికల నిండుగా ఏలాంటి వార్తలు చూచే వారం?

గత రెండు రోజులుగా ఎపిలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చలు సాగుతున్నాయి. ఎసి గదుల్లో కూర్చుని చర్చలు సాగించే చాల మందికి గత మూడు నాలుగు రోజులుగా ప్రజల్లో సాగుతున్న మధనం అందడం లేదు.

ఎగ్జిట్ పోల్స్ అనే పద్దతి ఈ రోజు అమలు లోనికి రాలేదు. అదేవిధంగా ఒపీనియన్ పోల్స్ కూడా చాలా రోజులుగా అమలులో వున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఈ రెండింటికి హేతుబద్ధత వుంది. శాస్త్రీయత వుంది. కాని రాజకీయ పార్టీలకు తోకలుగానూ పోటీ కాళ్ళుగాను మీడియా
సంస్థలు ప్రధానంగా టివి ఛానెల్స్ వక్రమార్గం పట్టిన తదుపరి వారు కొమ్ము కాచే పార్టీకి ఎటు బెడితే అటు సర్వే చేయడం మొదలైన తర్వాత హేతుబద్ధత శాస్త్రీయత లోపించిన సర్వేలు అభాసు పాలౌతున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో టిడిపి ఓడి పోతాయని వచ్చిన ఫలితాలపై మీడియా చేతిలో వుందని కొంత మందిని పోగేసి అసలు సర్వేలే తప్పని ప్రచారం మొదలు పెట్టారు.

ఇక్కడ రెండు అంశాలు వున్నాయి. 1) ఇప్పుడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శాస్త్రీయంగా చేశారా? లేదా? మనం నిర్థారణ చేయలేము గాని ఈ విధానమే తప్పని చెప్పే వారితో ఏకీభవించ లేము. 2) ఒక వేళ ఎపిలో టిడిపి స్వీప్ చేస్తుందని, కేంద్రంలో బిజెపి ఓటమి చెందుతుందని ఫలితాలు వచ్చి వుంటే ఎపిలో మీడియాతో పాటు టివి చర్చలలో విశ్లేషకులుగా వుండేవారు ఏవిధంగా స్పందించే వారు? ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఇలా వుండేదా?

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*