ఎట్టకేలకు బ్రహ్మోత్సవ బహుమానం జీవో విడుదల

టిటిడి ఉద్యోగ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడానికి ఆమోదం తెలియజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో బ్రహ్మోత్సవాలు ముగిసినా….బహుమానం ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. నవంబర్‌ నెలలో బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినా…జీవో విడుదల చేయడంలో జాప్యం జరిగింది.

ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ధర్మచక్రం వారపత్రిక, ధర్మచక్రం వెబ్‌సైట్‌, ధర్మచక్రం యూట్యూబ్‌ ఛానళ్లలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 18.01.2019న జీవో విడుదల చేసింది.

రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.13,500, కాంట్రాకు ఉద్యోగులకు రూ.6,600 బ్రహ్మోత్సవ బహుమానంగా ఇవ్వాలని టిటిడి పాలక మండలి తీర్మానం చేసింది. దీనికి ప్రభుత్వం జీవో నెం.90 ద్వారా ఆమోద ముద్ర వేసింది.

గత ఏడాదితో పోల్చితే ఈ పెరుగుదల బహు స్వల్పం. గత ఏడాది రెగ్యులర్‌ ఉద్యోగులకు 13,125 ఇచ్చారు. ఈసారి రూ.13,500 చేశారు. అంటే పెరిగింది రూ.375 మాత్రమే. కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది రూ.6,562 ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రూ.6,600 చేశారు. అంటే రూ.38 పెరిగిందన్నమాట. ఇది నామమాత్రపు పెంపుదల అని ఉద్యోగ కార్మికులు పెదవి విరుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*