ఎన్నికలు నిర్వహించాలంటే ఐక్యరాజ్యసమితి అనుమతి తీసుకురావాలేమో..!

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్…రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాసిన లేఖలోని వివరాలను గమనిస్తే ఆయన ఎంత ఏకపక్షంగా ఉన్నారో‌ అర్థమవుతుంది. ఇటు సిఎం గానీ, అటు సిఎస్ గానీ లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా వివరణ ఇవ్వకుండా డొంకతిరుగుడు సమాధానంతో సరిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రంలోని కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ అనుమతి ఇవ్వాలంట. ఆ అనుమతి కూడా ప్రభుత్వ సిఎస్ తీసుకురావాలట. ఇది ఆయన ధోరణి. ఈ వాదనలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. ఇంకా నయం… రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు కావాలనో, ఐక్యరాజ్యసమితి అనుమతులు తీసుకురావాలనో షరతు విధించలేదు.

ఎన్నికలు వాయిదా వేసేముందు….రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించారా, సిఎస్ తో మాట్లాడారా…ఈ అంశంపై ఫైలు బిల్డప్ చేశారా, అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదు, ఎన్నిక‌ల వాయిదా ఆర్డర్ ను ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా తెలియకుండా రహస్యంగా తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది…ఇవీ రమేష్ కుమార్ సమాధానం చెప్పాల్సిన ప్రధానమైన ప్రశ్నలు.

కరోనాపై టాస్కఫోర్స్ అభిప్రాయం తీసుకున్నానని రమేష్ కుమార్ చెబుతున్నారు. అంటే రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పనికిమాలిన వాళ్లనా..! ఇంతటితో ఆగలేదు…ఎన్నికలు వాయిదా వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతే…తాను సహకరించి నిధులు తెప్పిస్తానని చెబుతున్నారు. ఇది అహంభావం కాదా..! తన పరిధిని దాటినట్లు కాదా అని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తాను అభినందిస్తున్నానని పొగుడుతూనే మరోవైపు అదే అధికారులను అవమానించేలాగా వ్యవహరిస్తున్నారు. ఇదేం పద్ధతి.. !

తన ఏకపక్ష నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ తనకు మాత్రమే తెలివితేటలు ఉ‌న్నాయనేలాగా లేఖ రాశారు. రమేష్ కుమార్ ధోరణి ఏమిటో ఆయన లేఖ ద్వారా ఆయ‌ఏ బయట పెట్టుకున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*