ఎన్నికల్లో ఓడిపోయినవారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించాలని చూస్తున్నారు : కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై ఏపి ప్రజల్లో ఆసక్తి

ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆజ్ తక్ ఛానల్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన వారు తరచూ కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక్కడ‌ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రతి కార్యక్రమం పైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఓట్ల కోర్టులో కేసులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపైనా కేసులు వేసిన పరిస్థితి.

రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకుంటున్నాయన్నది మంత్రి వ్యాఖ్యల్లోని‌ ఆంతర్యంగా కనిపిస్తోంది. తన వద్దకు వచ్చిన కేసులను స్వీకరించడం, బాధితులకు న్యాయం చేయడం కోర్టుల బాధ్యతేగానీ…పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా కోర్టులపైన ఉంది. -ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*