ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు ఊహించని షాక్…!

కరోనా పేరు చెప్పి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని ఎదురయింది. రాష్ట్రంలో కరోనా భయం లేదని, ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందికర వాతావరణం ఏమీ లేదని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ ఒక లేఖను రమేష్ కుమార్ కు రాశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో లేఖనుఎన్బికల సంఘానికి రాశారు.

కరోనా భయంతోనే ఎన్నికలు వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించారా…వారి సూచనలను తీసుకున్నారా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వంలోని హెల్త్ అధికారుల సలహాలు తీసుకున్నానని రమేష్ కుమార్ చెప్పారు. అయితే ఎవరు నుంచి ఎటువంటి సహాలు తీసుకున్నారు, దాని సంబంధించి ఏవైనా రాతపూర్వకమైన పత్రాలు ఉన్నాయి…అనే విషయం మాత్రం చెప్పలేదు.

అంతర్జాతీయ నిపుణుల సలహాలూ తీసుకోవచ్చు…. ప్రాథమికంగా రాష్ట్రంలోని అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారు. ఇదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటోంది. ఆఉన నిజాయితీని ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లేఖలతో రమేష్ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పాలి. ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళితే కచ్చితంగా ఈ ఇద్దరు రాసిన లేఖను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివాదం ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*