ఎన్నికల వాయిదాలో రమేష్ కుమార్ చిక్కుల్లోపడ్డారా..!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధారాలతో సహా దొరికిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక రాజకీయ కారణాలున్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారు. కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లుగా రమేష్ కుమార్ ఆదివారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సంఘం‌ ప్రకటన రాగానే ముందుగా అందరూ ఇది మంచిదే అనుకున్నారు. అయితే ఎన్నికల వాయిదా పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించిన విషయాలను పరిశీలించిన తరువాత….. ఎన్నికల వాయిదాకు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సంగతి అందరికీ అర్థమైంది.

కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు వాయిదా వేస్తే తప్పులేదు. అయితే రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎన్నికలు నిర్వహించవచ్చా.. నిర్మించకూడదా అనేది ఆరోగ్య శాఖ అధికారులతో ప్రాథమిక చర్చించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్ పైన ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తీవ్రత ఎంతగా ఉందో చెప్పగలిగేది ఆరోగ్య శాఖ అధికారులు మాత్రమే. అధికారులతో అధికారులతో కూడా చర్చించకుండా…. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా పెరుగుతుందని‌ ఎన్నికల కమిషనర్ ఏ విధంగా నిర్ణయానికి వచ్చారన్నది ఇప్పుడు ప్రశ్న.

ఆరోగ్య శాఖ అధికారులుతో చర్చలు జరిపివుండి, వారు అటువంటి ఆందోళన వ్యక్తం చేసి ఉంటే ఎన్నికలు వాయిదా వేయవచ్చు. వైద్యులు, వైద్య శాఖ అధికారులు సలహాలతో మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఒక ఐఏఎస్ అధికార ఎలా తీసుకోగలరు…! ఇవన్నీ గమనించిన తర్వాత రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనక రాజకీయ నాయకులు ఉన్నారన్న అనుమానం బలపడుతోంది.

ఎన్నిక వాయిదా అనేది చాలా పెద్ద నిర్ణయం. ఆరోగ్య శాఖ అధికారులనే కాదు రాజ్యాంగ నిపుణులతోనూ సంప్రదించి వుండాలి. అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా ఆలోచించివుండాలి. ఇవేవీ లేకుండా ఎన్నికలు వాయిదాకు కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు అనేది రమేష్ కుమార్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.

ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తయారైన ఉత్తర్వులు విషయం… ఎన్నికల సంఘంలోని కార్యదర్శికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందనేది మరో ప్రశ్న. కార్యదర్శికి తెలీకుండా ఉత్తర్వులు తయారుచేయడంలోని ఆంతర్యం ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో తయారు చేసిన ఉత్తర్వులను రమేష్ కుమార్ చదివి వినిపించారని విమర్శించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికల అధికారే‌ సమస్యకు కేంద్రబిందువుగా మారిపోవడం దురదృష్టకరం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*