ఎన్నికల సంఘాన్ని ఉతికి ఆరేసిన సుప్రీంకోర్టు..! నిమ్మగడ్డ రమేష్ కు జీవితకాల పాఠం!!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉతికి ఆరేసింది. ఎన్నికల సంఘం తీరును తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఈ దశలో జోక్యం చేసుకుని ఎన్నికలను కొనసాగించమని తీర్పునిస్తే…అది ఎన్నికల సంఘం స్వతంత్రకు, హుందాతనానికి అమర్యాద అవుతుందన్న వివేచతో‌ అటువంటి తీర్ప ఇవ్వలేదు మినహే..ఇప్పటి దాకా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును నిశితంగానే తప్పబట్టింది.

సుప్రీంలో జరిగిన వాదనలు చూస్తే…ఎవరైనా ఇదే నిర్ణయానికి వస్తారు. ఇంతకీ కోర్టులో ఏం జరిగిందంటే… సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నద్‌కర్ని వాదనలు వినిపించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయి….

ఒకవైపున ఎన్నికలను వాయిదా వేస్తారు… ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారు. ఈరెండూ ఎలా చేయగలుగుతారు? ప్రభుత్వం, పాలన స్తంభించపోవాలా? ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్‌ తెలుసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది.. వీటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేవియట్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ ఒక పొలిటికల్‌ లైన్‌ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది.
ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదు…అని ప్రభుత్వ న్యసయవాది వాదన వినిపించారు.

ఈ దశలో‌ తమ నిర్ణయంలో రాజకీయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపైన చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే స్పందిస్తూ… తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు. కాని, పరిస్థితి ఇంతవరకూ ఎందుకు వచ్చింది…అని ప్రశ్నించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. కోడ్‌ ఉంటుందని, ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించింది. దీంతో… ఒకవైపు ఎన్నికలను వాయిదా వేస్తామంటున్నారు, ఇంకోవైపున ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగిస్తా మంటున్నారు ల. రెండు వైపులా ఎలా చేస్తారు…అంటూ జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ స్తంభించిపోవాలని కోరుకుంటున్నారా? అని జస్టిస్‌ గవాయ్‌ ఎన్నికల సంఘం న్యాయవాదిని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టాల పంపిణీని హైకోర్టు నిలుపుదల చేసిందంటూ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది ప్రయత్నించగా…వెంటనే అడ్డుకున్న అడిషనల్‌ సొలిటిర్‌ జనరల్‌, అలాంటి ఆదేశాలేవీ హైకోర్టు ఇవ్వలేదని, ఏజీ కూడా ఇక్కడే ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలియజేసారు.

ఇప్పటికే వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ జారీచేసినందున ఎన్నికల వాయిదా విషయంలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి – కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన లేదా ఇనీషియేట్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోరాదని ఆదేశించారు. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టంగా చెప్పారు. తిరిగి ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు కోడ్‌ అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ మొత్తం తీర్పును గమనిస్తే…ఏ అంశాలనైతే ముఖ్యమంత్రి లేవనెత్తారో‌ అవే అంశాల్లో ఎన్నికల‌ సంఘానికి కోర్టులో మొట్టిక్కాయలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధమే లేదన్నటు ఎన్నికలను ఏకపక్ష నిర్ణయంతో వాయిదా వేశారు. ఇది సరైనది కాదని కోర్టు తీర్పుతో తేలింది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ప్రభుత్వంతో‌ సంప్రదించాలని కూడా స్పష్టంగా చెప్పింది.

ఎన్నికల నియమావళి కొనసాగింపు వల్ల‌ ప్రభుత్వం స్తంభించిపోతుందని‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినా ఎన్నికల సంఘం‌ పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టు అదే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి…నియమావళిని‌ తొలగించమని చెప్పింది.

ఏదిఏమైనా….ఎంత పెద్ద వ్యవస్థ అయినా చట్టాలు, పద్ధతులు, విధానాల ప్రకారం కాకుండా ఇష్టానుసారం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని సుప్రీం తీర్పుతో రుజువయింది.‌ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇది జీవిత కాలానిపైగా సరిపడే పాఠం అవుతుందని చెప్పడంలో తప్పులేదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*