ఎన్నికల హోరు….వలసల జోరు…శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..!

శ్రీకాళహస్తి మండలం, బొక్కిసంపాళ్యం గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్, తొండమానుడు చెరువు ఆయుకట్టు ఛైర్మన్ పల్లమాల గోవింద్ రెడ్డి, ఆయన అనుచరులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు టి.చెంచురెడ్డి, ఎస్సీవీ నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బియ్యపు మధుసూదన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బర్రి హేమభూషణ్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కప్పా సుబ్రమణ్యం, హరికుమార్, నారాయణ, వెంకట సుబ్బా రెడ్డి, కిరణ్, కాపుగున్నేరి సింగిల్ విండో ఛైర్మెన్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*