ఎన్‌టిఆర్‌ బయోపిక్‌కు ‘మహానటి’తో చిక్కు!

మహానటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' సినిమాపై తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో చర్చ జరిగిందట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారట. సినిమా బాగుందని అందరూ చెబుతున్నారు...తప్ప చూస్తాని అన్నారట. మహానటి సినిమాపై ఇపప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. అందరూ ముక్తకంఠంతో సినిమా అద్భుతంగా ఉందని కీర్తిస్తున్నారు. చంద్రబాబుకు కూడా కచ్చితంగా సినిమా నచ్చుతుంది. ధర్మచక్రం తన సమీక్షలో చెప్పినట్లు 40 సంవత్సరాలకు పైబడిన వారికి మహానటి సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే...ఈ వయసులోని వారు సావిత్రి సినిమాలు అనేకం చూసివుంటారు. నేటి యువతరానికి ఆ అవకాశం లేదు. టివీల్లో వచ్చినా పాత సినిమాలను చూసే ఆసక్తి ఉండదు. మహానటి సినిమా చూసిన తరువాత యువతరం కూడా సావిత్రి సినిమాలను యూట్యూబ్‌లో కచ్చితంగా చూస్తారు.

ఇంతంగా అంశంగానీ...అసలు సమస్య మహానటి సినిమా కాదు. ఎన్‌టిఆర్‌ బయోపిక్‌. ఎన్‌టిఆర్‌ జీవిత గాథను ఆధారంగా చేసుకుని, బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటించబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి పూనుకున్నారు. ఇంతలో ఏమయిందోగానీ...ఎన్‌టిఆర్‌ బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించలేనని ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు దర్శకుడు ఎవరనేది ప్రశ్నగా మారింది. బాలకృష్ణనే దర్శకత్వం వహిస్తూ నటిస్తారన్న వార్తలూ వచ్చాయి. మహానటి సినిమా చూసిన తరువాత ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ అంతకంటే రిచ్‌గా ఉండాలి. అంతకంటే అద్భుతంగా తీయగలగాలి. ఎందుకంటే ఎన్‌టిఆర్‌కు సావిత్రికి మించిన విజయగాథ ఉంది. ఆమె నిజ జీవితంలోని విషాదానికి మించిన విషాదం ఉంది. మహానటి విడుదలకాక మునుపు ఎలా తీసినా చెల్లేదేమోగానీ...ఇప్పుడు ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ను అంత తేలిగ్గా తీయడానికి అవకాశం లేదు. అభిమానుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. కచ్చితంగా ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ను మహానటి సినిమాతో పోల్చి చూస్తారు. అందుకే ఇప్పుడు ఎన్‌టిఆర్‌ బయోపిక్‌కు దర్శకత్వం వహించడానికి దర్శకులు అంత తేలిగ్గా ముందుకు రాకపోవచ్చు.

ఇందులో ఇంకో అంశం కూడా ఉంది. సావిత్రి కథను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఒక తపస్సులాగా తీశారు. సావిత్రిపై ఉన్న అభిమానంతో తీశారు. కానీ ఎన్‌టిఆర్‌ సినిమా తీయాలనుకుంటున్న ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకునే ఎన్‌టిఆర్‌ బయోపిక్‌కు ప్లాన్‌ చేశారని అంటున్నారు. ఆ లక్ష్యంతో తీసినా...మహానటి కంటే అద్భుతంగా ఎన్‌టిఆర్‌ను చూపించగల సత్తా, సమర్థత ఉన్న దర్శకుడిని వెతుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా మొదటి భాగంలో చూపించాలని ఎవరో టిడిపి సమావేశంలో సూచించినట్లు వార్తలొచ్చాయి. వాస్తవంగా ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాతే...అసక్తికరమైన డ్రామా నడుస్తుంది. సినిమాకు ఆ భాగమే అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొదట్లోనే బాలకృష్ణ మాట్లాడుతూ....ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ఆపాలో తమకు బాగా తెలుసునని అన్నారు. మరి ఎన్‌టిఆర్‌ను ఎలా చూపిస్తారో, ఎంత వరకు చూపిస్తారో సినిమా విడుదలైన తరువాత చూడాల్సిందే.

INDIA - OCTOBER 29: NT Rama Rao, President of the party and Chief Minister with Nara Chandrababu Naidu ( TDP, Together ) (Photo by Hk Rajashekar/The India Today Group/Getty Images)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*