ఎయిర్‌బస్‌ కంటే ఎర్రబస్సే నయంలావుంది!

ఎయిర్‌ ఇండియా విమానాల దుస్థితి చూస్తుంటే…మన ఆర్‌టిసి ఎర్రబస్సులే ఎంతో నయం అనిపిస్తోంది. ఆర్‌టిసి ఎంత నష్టాల్లో ఉన్నప్పటికీ…బస్సులు మరమ్మతులకు గురయితే వెంటనే రిపేరు చేస్తారు. ఇందుకు అవసరమైన స్పేర్‌ పార్ట్స్‌ డిపోల్లో ఉంటాయి. అయితే…ఎయిర్‌ ఇండియా విమానాలు మరమ్మతులకు గురయితే…రిపేరు చేయడానికి విడిభాగాలు లేవట. రిపేర్లకు అవసరమైన నిధులూ లేవట. దీంతో మరమ్మతులకు నోచుకోకుండా అనేక విమానాలు మూలనపడి ఉన్నాయట.

ఎయిర్‌ ఇండియా దాదాపు రూ.50 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయివుంది. ఈ నష్టాల నుంచి బయటపడేయడానికి…సంస్థ ఆస్తులు విక్రయించాలని 2011లోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ఏడాదికి రూ.500 కోట్లు దాకా సమకూర్చుకోవాలని అనుకున్నారు. అయితే….ఆస్తుల పత్రాల్లోని లోపాలు, అప్పటికే లీజుకు ఇచ్చిన వాటిని అమ్మడానికి వీల్లేదని పట్టణాభివృద్థి సంస్థ అభ్యంతరాలతో…అమ్మకాలు సాగలేదు. ఎయిరిండియాను అమ్ముతామన్నా కొనేవాళ్లు లేరట. ప్రస్తుతం నెలకు రూ.200 కోట్లు – రూ.250 కోట్లు ఆర్థిక లోటు ఉంటోందట. దీంతో విమానాల రోజువారీ మరమ్మతులకూ నిధులు వెచ్చించలేని దుస్థితి నెలకొందట. ఇవన్నీ చూస్తుంటే…ఎయిరిండియా ఎయిర్‌ బస్‌ కంటే మన ఆర్‌టిసి బస్సే నయం అనిపించేలా లేదూ..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*