ఎస్వీయూ ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు…ఇద్దరూ సుబ్రమణ్యంలే!

ఎస్.వి. యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా పికె సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా ఎన్.సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి రఘునందన్ వెల్లడించారు. అధ్యక్ష పదవి కోసం నలుగురు పోటీపడగా పికె విజయం సాధించారు. కార్యదర్శి పదవి కోసం ముగ్గురు బరిలో నిలవగా ఎన్.సుబ్రమణ్యం విజయాన్ని కైవశం చేసుకున్నారు.

మొత్తం 36 కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉండగా 24 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 పదవులకు పోటీ జరిగింది. గిరీష్ కుమార్, చంద్రశేఖర రాజు, ఇ.చంద్రశేఖర్, మస్తాన్ బాషా, బి.వెంకటేశ్వర్లు, లీలాకృష్షారెడ్డి, హరిబాబు, రామానాయుడు, వెంకట నరసింహులు, వరప్రసాద్, మదన మోహన్ రెడ్డి తమ‌ ప్రత్యర్థులపై విజయం సాధించారు.

ఇక కె.నాగరాజు, వెంకటరమణ, ఉదయ భాస్కర్, రవి శంకర్, వెంకట రమణ, శివశంకర్ గౌడ్, జీవన్ కృష్ణ, పవన్ కుమార్ రెడ్డి, మనోజ్ కుమార్ సింగ్, నాగ భూషణం, ఆది శేషయ్య, శేఖర్, ముత్తువేలు, సుదర్శనమ్మ, అమ్మణ్ణి, ప్రసాద్ బాబు, ఎస్.సుబ్రమణ్యం, వాసుదేవయ్య, కాశీవిశ్వనాద చెట్టి, కె.మురళి,‌నవీన్, కృష్ణ కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గెలుపొందిన వారు తమ నుంచి ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకోనున్నారు. ఈ కార్యవర్గం మూడేళ్లపాటు అధికారంలో ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*