ఏనుగుని తేనెటీగతో భయపెట్టారు!

ఆకారంలో ఏనుగు భారీగా ఉంటుంది. అయితే దాని తోక వెంట్రుకలో ఒక చిన్న ముక్కంత కూడా ఉండని తేనెటీగ అంటే విపరీతమైన భయమట. దీన్ని తెలివిగా వాడుకున్నారు రైల్వే అధికారులు. గౌహతితో ఈశాన్య సరిహద్దు రైల్వేకి ఏనుగుల బెడద తీవ్రంగా ఉందట. అటవీ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌పైకి ఏనుగులు రావడం, ప్రమాదవశాత్తు రైలుకిందపడి చనిపోవడం పరిపాటిగా మారిపోయిందట. ఏనుగులు ట్రాక్‌పైకి రాకుండా నివారించడానికి కంచెవేయడం, కందకాలు తవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు. దీనికోసం కోట్లు రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఏనుగులకు తేనెటీగలంటే విపరీత భయమని అటవీ అధికారులు చెప్పిన ఒక మాటతో రైల్వే అధికారులకు ఓ ఆలోచన తట్టింది. తేనెటీగలు సంచరిస్తే ఎటువంటి శబ్ధం వస్తుందో దాన్ని రికార్డు చేసి, రైల్వేట్రాక్‌కు కొంత దూరంలో స్పీకర్లు ఏర్పాటు చేసి, ఆ శబ్దాన్ని వినిపించడం మొదలుపెట్టారు. ఈ ఐడియా సక్సెస్‌ అయిందట. ఏనుగులూ ట్రాక్‌కు దూరంగా నిలిచిపోతున్నాయట. రైలు కింద పడి చనిపోతున్న ఏనుగుల సంఖ్య తగ్గిందట. తెనెటీగల శబ్దం సృస్టించడానికి అయిన ఖర్చు కొన్ని వేల రూపాయలు మాత్రమే. కోట్లు ఖర్చుచేసినా జరగని పని వేల రూపాయలతో అయింది. ఏనుగుల ప్రాణాలను కాపాడుతున్న రైల్వే అధికారులను అభినందించాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*