ఏపీలో 1000 దాటిన కరోనా కేసులు..! శ్రీకాకుళంలోనూ కేసులు నమోదు..!!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల‌ సంఖ్య 1000 మార్కు దాటింది. 24 గంటల్లో (24వ తేదీ ఉదయం ‌9 నుండి 25 ఉదయం 9 దాకా) కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి‌. ఇందులో కృష్ణా జిల్లాలోనే 25 కెసులున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసుల సంఖ్య 1016 చేరుకుంది. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి దాకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు.‌ ఇప్పుడు కేసులు లేని జిల్లాగా ఒక విజయనగరం మాత్రమే మిగిలింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1016 పాజిటివ్ కేసులకుగాను 171 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది మరణించారు. ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.

25.04.2020, ,ఉదయం 10 గంటల రిపోర్ట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*