ఏర్పేడు చింతలపాలెం భూసేకరణ సర్వే నిలుపుదల…ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ ప్రారంభం

ఏర్పేడు, శ్రీకాళహస్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిర్దేశించిన విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కావలసిన 24 వేల ఎకరాల భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయని తిరుపతి ఆర్. డి. ఓ. కనక నరసారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏర్పేడు మండలం చింతలపాలెం , శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు ప్రాంతాలను ఆర్డిఓ, స్ర్వే అధికారులు పర్యటించారు.

ఈ సందర్భంగా ఆర్. డి. ఓ. వివరిస్తూ చింతల పాలెం ఏ. పి. ఐ. ఐ. సి కోసం చేస్తున్న భూ సేకరణ సర్వే నిలిపివేస్తున్నట్లు, రెండు పంటలు పండే భూములు వుంటే రాష్ట్ర ముఖ్య మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి యున్న నేపద్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. చింతలపాలెం వాసులు తాము వేసుకున్న వారి పొలాలలు ఆర్. డి. ఓ . గారికి చూపించి సర్వే సేకరణ విరమించుకోవాలని కోరారు. సర్వే ఆపివేస్తున్నట్లు హామీ ఇస్తూ, జిల్లా కలెక్టర్ డా. భారత్ గుప్తా గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేస్తారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.


అనంతరం ఇనగలూరు చేరుకుని విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం 24 వేల ఎకరాలు సేకరించవలసి యున్నదని, మొదటి దశ లో 12 వేల ఎకరాల లక్ష్యం గా శ్రీ కాళహస్తి , బి ఎన్ కండ్రిగ , తొట్టంబేడు మండలాలలో మొదలవుతున్నదని ఇనగలూరు నుండి సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్కడి రైతులకు వివరుస్తూ భూసేకరణ ప్రారంభమైనందున రైతులు తమ దగ్గర వున్న పత్రాలను సర్వే టీం కు అందించి పరిహారం పొందాలని తెలిపారు. చెన్నై, బెంగళూరులలో పారిశ్రామిక వాడల విస్తరణ కన్నా, మన జిల్లాలపై ఎక్కువమంది పారిశ్రామిక వేత్తలు దృష్టి సారిస్తున్నారని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు తప్పనిసరి గా కుటుంబానికో ఉద్యోగం అక్కడ వచ్చే పరిశ్రమలు వారే కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని వివరించారు.


ఆర్ డి ఓ పర్యటనలో సర్వే టీములు, రెవెన్యూ అధికారులు , చింతలపాలెం , ఇనగలూరు గ్రామస్తులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*