ఒకే రోజు చిత్తూరు జిల్లాలో 15 కరోనా కేసులు..!

ప్రభుత్వం సోమవారం ‌(18.05.2020) ఉదయం 10 గంటలకు విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 కేసులు కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉ‌న్నవే. ఇప్పటి దాకా చిత్తూరు జిల్లాలో 192 కేసులు నమోదు కాగా 82 మంచికి ఆరోగ్యం బాగుపడి ఆస్పత్రి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. 110 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుండగా…రాష్ట్ర వ్యాపితంగా కరోనా కేసుల సంఖ్య 2282కు పెరిగింది. ఇందులో తాజాగా నమోదైన 52 కేసులు కూడా ఉన్నాయి. తాజా కేసుల్లో చిత్తూరు 15, కృష్ణా 15, నెల్లూరు 7, కర్నాలు 4, కడప 2, విశాఖ 1, విజయనగరం ‌1, తూర్పు గోదావరి 5, ప.గోదావరి 2, కేసు ఉన్నాయి. తాజా కేసుల్లో 19 కేసులకు కోయంబేడు నేపథ్యం‌ ఉంది.

రాష్ట్రంలో ఇప్పటి దాకా 1527 మంది డిచ్చార్జ్ అయ్యారు. 705 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*