ఓటేస్తే…ఫ్రీ దోసె కాఫీ!

ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం అనేక రకాలుగా ప్రచారం చేస్తుంటుంది. ఓటర్లను చైతన్యపరుస్తుంది. అయితే బెంగుళూరులో ఓ హోటల్‌ యజమానికి ఓటింగ్‌ శాతాన్ని పెంచడం కోసం…ఓటేసిన వాళ్లకు తన హోటల్‌లో ఉచితంగా దోసె, కాఫీ ఇస్తానని ప్రకటించారు. ఈ ఆఫర్‌ అందరికీ లేదు సుమా…కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్లకు మాత్రమే. పోలింగ్‌ స్టేషన్‌కి వెళ్లి ఓటు వేసినట్లు వేలిపై సిరా గుర్తు చూపిస్తే హోటల్‌లో దోసె తిని, కాఫీ తాగి వెళ్లవచ్చని ఆయన చెప్పారు. వాస్తవంగా ఓటింగ్‌ శాతం తగ్గుతోంది యువతరంలో నిర్లిప్తత వల్ల కాదు. మధ్య తరగతి ప్రజలు ఓటింగ్‌కు రాకపోవడం వల్లే. హోటల్‌ యజమానికి మాత్రం తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారికి మాత్రమే దోసె, కాఫీ ఆఫర్‌ ఇచ్చారు. ఇందులోని మతలబు ఏమిటో తెలియదు. ఎంతమంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటారోగానీ….ప్రచారం మాత్రం బాగానే వస్తోంది ఆ హోటల్‌కు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*