కరోనాకు ఇంట్లోనే చికిత్స…ప్రైవేటు ఆస్పత్రి స్పెషల్ ప్యాకేజీ.. !

కరోనా వస్తే ప్రభుత్వ‌ ఆస్పత్రుల్లోనే చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లినా లక్షల్లో బిల్లులు వేస్తున్న దుస్థితి. హైదరాబాదులోని కరోనా చికిత్సకు మూడు లక్షల బిల్లు వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే చెన్నైలోని‌ ఎంజిఎం హెల్త్ కేర్ ఆస్పత్రి‌ మధ్యేమార్గంగా కొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది. కరోనా బాధితులను ఇంటిలోనే ఉంచి, తక్కువ ఖర్చతో చికిత్స అందిస్తామని ప్రకటించిమనది. ఎంజిఎం@హోం పేరుతో ప్రకటించిన కోవిడ్ చికిత్స ప్యాకేజీల వివరాల్లోకి వెళితే…

మొదటి ప్యాకేజీలో రూ.19,000 చెల్లిస్తే…14 రోజులు చికిత్స అందిస్తారు. డాక్టర్ నాలుగుసార్లు పరీక్షిస్తారు. నర్సు 28 సార్లు ఇంటికి వచ్చి పరీక్షిస్తారు. డైటీషియన్ ఒకసారి వచ్చి ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు. మందులు ఇంటికే తెచ్చి ఇస్తారు. ఒక హోం కిట్టు అందజేస్తారు.‌ అందులో 50 మాస్కులు, శానిటైజర్ బాటిల్, గ్లవుజులు, అవసరమైన మందులు ఉంటాయి. అదేవిధంగా‌ రూ.23,900 చెల్లిస్తే కోవిడ్ టెస్టు కూడా చేస్తారు.

అయితే ఇది స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మాత్రమేనని‌ ఎంజిఎం యాజమాన్యం ప్రకటించింది. కరోనా బాధితులను‌ ఆస్పత్రికి తీసుకెళ్లి, భయపెట్టి, లక్షల్లో బిల్లు వేయడంకంటే…ఇలా పారదర్శకంగా ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*