కరోనాకూ ఎన్నికలకూ లింకేమిటి…! వాయిదా వేయాల్సిన అవసరం ఉందా.. !

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.‌ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికే నీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయినా కరోనాకి భయపడి ఎన్నికల వాయిదా వేయాల్సిన అవసరం ఉందా… ఇందులో అంత ప్రమాదం ఏముంది.

కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్. కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా పక్కనున్న వారికి కరోనా సోకుతుంది.‌ అంతేకాదు…ఆ వ్యక్తి వాడిన వస్తువులను తాకినా వైరస్ బారిన పడుతారు.

ఎన్నికల్లో పోలింగ్ జరిగితే…వేలమంది బూత్ లోకి వెళ్లి స్వస్తిక్ సింబల్ తో ఓటు వేయాల్సివుంటుంది. ఓటు వేసిన వారిలో ఎవరికైనా ఒకరికి కరోనా వుంటే…ఆ తరువాత ఓటు వేసిన వారికీ సోకితుంది. అంటే ఒక వ్యక్తి వల్ల వేలమందికి వైరస్ సోకుతుంది.

అదేవిధంగా…బ్యాలెట్ పత్రాలకు, బాక్సులకు వైరస్ అంటుకుంటుంది. ఓట్ల లెక్కింపు రోజు సిబ్బందికి మొత్తం వైరస్ అంటుకుంటింది. ఆ సిబ్బంది కుటుంబాలకు, మిత్రులకు వైరస్ సోకుతుంది. పేపర్ పైన, టేబుళ్లపైన రోజుల తరబడి వైరస్ బతికే ఉంటుంది.

అందుకే…ఎన్నికల సంఘం స్థానిక‌ సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. ప్రజల ఆరోగ్యం రీత్యా ఇది అనివార్యం. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని‌ అభినందించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*