కరోనాతో మరో ఎంఎల్ఏ మృతి..!

కరోనా ఎవర్నీ వదిలిపెట్టదు. దానికి హోదాలతో పనేలేదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవర్నయినా కబళించేస్తుంది. ఇటీవల తమిళనాడులో డిఎంకె ఎంఎల్ఏ ఒకరు కరోనాకు బలయ్యారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనాతో మృతి చెందారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన బుధవారం కన్నుమూశారు. తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ ప్రెసిడెంట్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*