కరోనాపై యుద్ధం కోసం టిటిడి ఉద్యోగుల విరాళం..

కరోనా విపత్తు నివారణ కోసం టిటిడి ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.‌ టిటిడి ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గంపల వెంకటరమణ రెడ్డి, గోల్కొండ వెంకటేశం, భాస్కర్, ప్రసాదరావు, ఇందిరా, వి. వెంకటరమణ, కల్పనా, సమన్వయ కమిటీ నాయకులు విజయకుమార్, మదన్ మోహన్, కుమారస్వామి, బాలాజీ, ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్స్ మునివెంకటరెడ్డి, శివకుమార్, వాసు, చీర్ల కిరణ్, గుణశేఖర్, హేమలత సుబ్రహ్మణ్యం, బి సి అస్సోసియేషన్ నాయకులు మునిబాల, నర్సింహులు, రామచంద్ర. తదితరులు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను, టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎంఎల్ఏ భూమన రుణాకర్ రెడ్డిని కలిసి అంగీకార పత్రాన్ని అందచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*