కరోనా ఉన్నా…శ్రీవారి ఆర్థిక స్తోమతకు డోకాలేదు…టిటిడి నిర్వహణకు పరిస్థితిపై భయంలేదు..!

  • ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారికి ఇప్పటికే రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి టిటిడి వెళ్లిపోతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి వార్తలు వేంకటేశ్వరస్వామి భక్తులకు ఆందోళన కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

కొన్ని నెలులు దర్శనాలు ఆగిపోయినంత మాత్రాన కలియుగ కుబేరుడైన శ్రీనివాసుడి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిపోతోందని చెప్పడం సరికాదన్న భావన భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. అయినా, నిజంగానే ఈ లాక్‌డౌన్‌ కాలంలో టిటిడికి రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందా?

తిరుమలేశునికి రోజూ సగటున రూ.3 కోట్లు హుండీ ఆదాయం సమకూరుతోంది. 50 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో…రూ.150 కోట్లు ఆదాయం కోల్పోయింది. శీఘ్రదర్శనాల రూపంలో రూ.35 కోట్లు దాకా నష్టపోయిందని అనుకోవాలి. ఇంకా తనీలాలు, ఆర్జిత సేవలు, అకామిడేషన్‌ తదితరాలు లెక్కించుకున్నా….ఇంకో రూ.15 కోట్లు ఉంటాయి. మొత్తంగా చూస్తే రూ.200 కోట్లకు లోపు మాత్రమే టిటిడి ఆదాయం తగ్గింది.

ఇదే సమయంలో టిటిడికి ఆదా అయినవీ ఉన్నాయి. లడ్డూ ప్రసాదాల తయారీ పూర్తిగా ఆగిపోయింది. లడ్డూ ధరను ఇటేవలే పెంచారుగానీ… పెంచక మునుపు ఒక లడ్డూ ఉత్పత్తికి రూ.40 దాకా ఖర్చవుతుండగా, సబ్సిడీ ధరతో ఇచ్చేవాళ్లు. దీనివల్ల ఏడాదికి రూ.200 కోట్లు దాకా టిటిడి భరించేది. ఈలెక్కన రోజుకు రూ.55 లక్షలు, 50 రోజుకు రూ.27 కోట్లు మిగిలిందని అనుకోవాలి.

ఇంకా అన్నప్రసాద వితరణకు రోజుకు రూ.30 లక్షలు ఖర్చవుతోంది. అన్న ప్రసాద  వితర పూర్తిగా ఆగిపోయింది. అన్నప్రసాదంలో రూ.15 కోట్లు ఆదా అయిందనుకోవాలి. తిరుపతిలో కరోనా బాధితుకు కొన్ని రోజు ఆహారపొట్లాలు అందించారు. దీనికి అయిన ఖర్చు తీసేసినా కనీసంగా రూ.13 కోట్లు ఖర్చు తగ్గింది. ఇలా లెక్కించినపుడు ఈ 50 రోజుల్లో టిటిడి కోల్పోయింది రూ.150 కోట్లకు మించకపోవచ్చు.

అయినా…ఇదంతా ఆదాయం కోల్పోయినట్లుగా చూడటానికి వీల్లేదు. భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఎక్కడికీపోవు. రేపు కరోనా తరువాత ఆలయం తెరిచినా…భక్తులు మొక్కు చెల్లించుకుంటారు. లాక్‌డైన్‌ వల్ల మొక్కు చెల్లించలేకపోయిన వారు ఆ తరువాతనైనా చెలిస్తారు. అప్పుడు హుండీ ఆదాయం మరింతగా పెరుగుతుంది. తనీలాలనూ అలాగే చూడాలి. మొక్కుబడి ఉన్న తరువాత ఎప్పుడో ఒకప్పుడు స్వామిరికి తనీలాలు సమర్పిస్తారు. తాత్కాలికంగా రాబడి ఆగిందనుకోవాలి తప్ప…. కోల్పోయినట్లు భావించడానికి వీల్లేదు.

టిటిడి వద్ద వద్ద రూ.14000 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాటిట్లు ద్వారా ఏడాదికి రూ.700 కోట్ల వడ్డీ వస్తోంది. అదేవిధంగా 8 మేల టన్నుల బంగారు డిపాజిట్లు ఉన్నాయి. ఈ బంగారం విలువ ఈ రోజుటి ధర ప్రకారం చూసినా రూ.3,3168 కోట్లు. అదేవిధంగా అన్నదానం ట్రస్టుకు రూ.1200 కోట్ల దాకా డిపాజిట్లు ఉన్నాయి. ఇతర ట్రస్టులకూ నిధున్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు రూ.20 వేల కోట్ల నగదు నిల్వలు టిటిడి ఉద్ద ఉన్నట్లు భావించాలి. ఈ పరిస్థితుల్లో టిటిడి నిర్వహణకు ఇప్పట్లో వచ్చిన డోకో ఏమీలేదు. ఇదే పరస్థితి దశాబ్దాలు కొనసాగినా….ఇదే స్థాయిలో అన్ని కార్యక్రమానూ నిర్వహించగల ఆర్థిక పరిపుష్టి టిటిడికి ఉంది. బ్యాంకులో డిపాజిట్లు చేసేదే…ఇటువంటి అనూహ్య పరిస్థితులను ఎదుర్కోడానికే. దీన్ని పక్కనపెట్టి ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవని చెప్పడం అర్ధ సత్యమే అవుతుంది.

ఇంతటి భరోసా శ్రీవారి కల్పిస్తుండగా… టిటిడి జీతాు ఇవ్వలేని స్థితిలో ఉందని చెప్పడం భక్తును అనవసరంగా కంగారుపెట్టడమే అవుతుంది. అయినా..ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారన్నది ప్రశ్నగా ఉంది. శ్రీవారికి ఆదాయం తగ్గిపోతుందనే పేరు చెప్పి… దర్శనాలు ప్రారంభించాలని తొందరపడుతున్నారు. అలాంటివారు గుర్తించాల్సింది ఏమంటే…స్వామివారు ఆజ్ఞాపించేదాకా ఆగాల్సిందే… అనేది మాత్రమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*