కరోనా కట్టిడికి టిటిడి ఉద్యోగుల విరాళం…రూ.83 లక్షల చెక్కు ముఖ్యమంత్రికి‌ అందజేత

కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం టీటీడీ ఉద్యోగులు తమవంతు సాయంగా ప్రభుత్వానికి రూ.83,86,747 విరాళం‌ అందజేశారు. ఈ మొత్తాన్ని యూనియన్ నాయకులు డిడి రూపంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి అందజేశారు. ఈ సమయంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కష్టకాలంలో సహకరించిన టీటీడీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు గోల్కొండ వెంకటేశం, చీర్ల కిరణ్, జాటోత్ భాస్కర్ పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన టీటీడీ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యనిర్వహణ అధికారి బసంత్ కుమార్, అడిషనల్ ఈ ధర్మారెడ్డికి‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*