కరోనా కష్టంలో శ్రీవారి చేయూత

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వలన ఎందరో అనాథలు, యాచకులు , నిత్యం విధులు నిర్వహిస్తున్న పోలీసులు… దుకాణాలు మూసేయడంతో పట్టెడ అన్నం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథలో పలు స్వచ్ఛంద సంస్థలు, నేతలు విరివిగా అన్నదానాలు చేస్తూ ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీసిటి ప్రముఖ మొబైల్ కంపెనీలో ఉన్నటువంటి శ్రీవారి ఎంటర్ ప్రైజెస్ కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రోజుకో పట్టణంలో అన్నదానాలు చేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆదివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులు, అనాథలు, యాచకులకు వెజిటబుల్ బిర్యాని , వాటర్ బాటిల్ అందించిన శ్రీవారి సంస్థ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి లో అనాథలు, యాచకులకు ఆహార పొట్లాలు, తాగునీరు అందించారు. ఈసందర్భంగా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కష్టసమయంలో తమవంతు సహకారం అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పట్టణాల్లో ఇలాంటి సేవాకార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శ్రీవారి సూపర్ వైజర్లు సుధాకర్, లావణ్య పలువురు పాల్గొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*