కరోనా : కువైట్ నుండి 149 మంది తిరుపతి విమానాశ్రయానికి రాక…!

తిరుపతి, రేణిగుంట మే 21: కోవిడ్ 19 కారణంగా విదేశాల్లో వున్న వారు రాక ప్రారంభమయింది , నేడు కువైట్ నుండి హైదరాబాద్ మీదుగా మొదటి సారి రేణిగుంట విమానాశ్రయానికి రాత్రి 11 గంటలకు పైగా కువైట్ నుండి ప్రవాసాంధ్రులు చేరుకోనున్నారని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త తెలిపారు. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని కవైట్ నుండి రానున్న వారి స్వంత జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 14 రోజుల క్వారేంటైన్ కు పంపనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు 7 మంది వున్నారని వారిని టూరిజం శాఖ వారు కోరే ఉచిత, చెల్లింపు క్వారేంటైన్ కు పంపడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాల వారిగా కడప 116 మంది, అనంతపురం 2, చెన్నై 1, తూ. గోదావరి 6, కృష్ణ 1, కర్నూలు 1, నెల్లూరు 6, వైజాగ్ 4, ప.గోదావరి 5 మంది వున్నారని, ఒక్కరు మాత్రం హైదరాబాద్ నివాసి హైదరాబాద్ లో దిగి తారని తెలిపారు.మిగిలిన 149 మంది రేణిగుంట విమానాశ్రయం చేరుకొనున్నారని తెలిపారు.

విమానం దిగిన వెంటనే సానిటైజేషన్, మాస్క్ అందించాలని సూచించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మహేశ్వరిబొల్లినేని వారి పల్లి, అత్తర్ నికత్, అఫ్జల్ ఖాన్ (ఇద్దరు) కలిచెర్ల, లలిత బాలయ్య గారి పల్లి , నరేష్ రెడ్డి పీలేరు, మస్తాన్ ముదివేడు, రాజేంద్రప్రసాద్, తిరుపతి వారు ఉన్నారు.

ఇమిగ్రేషన్ హైదరాబాద్ లో పూర్తి అయిందని లగేజీ తో స్వంత జిల్లాలకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వాహనాల్లో పంపిచనున్నామని తెలిపారు. రేణిగుంట చేరుకున్న వీరు ప్రభుత్వ డిక్లరేషన్ ఇవ్వనున్నారని, మొబైల్ సిమ్ ఏర్పాటు చేసి ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పంపడం జరుగుతుందని తెలిపారు. క్వారేంటైన్ లో టెస్ట్ ల ప్రక్రియ వుంటుందని తెలిపారు.

విమానాశ్రయం లో బ్యాగేజ్ డీస్ ఇన్ఫెక్షన్, ఫీవర్ టెస్ట్, డాటా ఎంట్రీ డెస్క్, సిమ్ సప్లయ్, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ వంటి కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ లు పరిశీలించారు.

కలెక్టర్ పర్యటన లో జెసి (అభివృద్ధి ) వీరబ్రహ్మం , తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఎయిర్ పోర్ట్ ఎపిడి సురేష్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, ఇండియన్ ఎయిర్ లైన్స్ టర్మీనల్ మేనేజర్ బాబీ, అడిషనల్ ఎస్.పి.సుప్రజ, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి, డిటి శివ ప్రసాద్, ప్రేమ్ కుమార్, డిఎస్పీ లు చంద్రశేఖర్, మల్లికార్జున, టూరిజం అధికారులు చంద్రమౌళి రెడ్డి, సురేష్ రెడ్డి, చంద్రశేఖర్, రేణిగుంట హెల్త్ ఆఫీసర్, వాలింటర్లు, సచివాలయ ఉద్యోగులు ఫారిన్ రిటర్నీ ల డాటా ఎంట్రీ వంటివి వాటికోసం సహాయకులుగా వున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*