కరోనా చిత్తూరు జిల్లా అప్ డేట్ :ర్యాపిడ్ కిట్లతో టెస్టులు ప్రారంభం

  • తిరుపతిలో వార్డు సచివాలయ ఉద్యోగులకు టెస్టు

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో మంగళవారం వార్డు సచివాలయ ఉద్యోగులకు (కోవిడ్ 19) కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ర్యాపిడ్ కిట్లతో నిర్వహించారు. తొలిరోజు మొత్తం 90 మందికి పరీక్షలు చేశారు. కమిషనర్ గిరీష మాటాడుతూ… మొదటి విడత 200 ర్యాపిడ్ కిట్లు వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో మరిన్ని కిట్లు అందుబాటులోకి వస్తాయని, ప్రతి ఒక్కరు ర్యాపిడ్ టెస్టులు పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఆధార్ కార్డు, నగరపాలక సంస్థ గుర్తింపు కార్డు, ఫోన్ నెంబర్ తెలియజేస్తే టెస్టులు నిర్వహిస్తారని తెలియజేశారు.

విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు (కోవిడ్19) కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్టులు ప్రతి ఒక్కరూ ర్యాపిడ్ పరీక్షలు చేసుకోవాలని, పది నిమిషాల్లో నమూనాకు సంబంధించి స్క్రీనింగ్ ఫలితాలు వస్తాయని, పాజిటివ్ వస్తే మరోసారి ల్యాబ్ కు నమూనాలు పంపిస్తామని, అక్కడ పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తామని చెప్పారు.
విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు జాగ్రత్తలు వహించాలని కచ్చితంగా మాస్కులు ధరించాలని, చేతికి గ్లౌజులు ఉండాలని భౌతిక దూరం పాటించాలని, రెడ్ జోన్ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని కమిషనర్ కోరారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధారాణి, డి.ఎస్.ఒ నీలకంటేశ్వర రావు, డి ఈ విజయ్ కుమార్ రెడ్డి, సచివాలయ ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*