కరోనా…చిత్తూరు జిల్లా తాజా సమాచారం…_(సమయం 09.04.2020 సాయంత్రం 5 )

 • మదనపల్లి, చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో కరోనా పాజి టివ్ కేసులు వస్తే చిత్తూరు లోని జిల్లా కోవిడ్ ఆసు పత్రికి తరలిస్తాం.
 • జిల్లాలో తొలి కరోనా బాధితుడు డిశ్చార్జ్…14 రోజులు స్వీయ నియం త్రణ పాటించాలని తెలిపిన వైద్యులు.
 • మన డాక్టర్ల సమిష్టి విజయం.
 • జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 19.
 • ప్రజలు ఆందోళన చెంద వద్దు. భౌతిక దూరం పాటి ద్దాం… కరోనా కట్టడికి కృషి చేద్దాం : జిల్లా కలెక్టర్

చిత్తూరు, ఏప్రిల్ 09 : మదనపల్లి,చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో కరోనా పాజి టివ్ కేసులు వస్తే చిత్తూరు లోని జిల్లా కోవిడ్ ఆసు పత్రికి తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండు కోవిడ్ ఆసుపత్రులు కలవని, ఇందులో తిరుపతిలో పద్మావతి మెడికల్ మహిళా వైద్య కళాశాల రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా కలదని, చిత్తూరు లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కరోనా పాజిటివ్ కేసులు మదనపల్లి, చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో నమోదైన వారిని ఇక్కడికి తరించడం జరుగుతుందని, వీలైనంత ప్రయాణ దూరం తగ్గించేం దుకు నిర్ణయం తీసుకున్నా మని తెలిపారు.పాజిటివ్ కేసులు ఉన్న వారి కేసు తీవ్ర త,మరియు ఆరోగ్య స్థితి గతులను బట్టి కేసులను జిల్లా కోవిడ్ ఆసుపత్రికి లేదా రాష్ట్ర కోవిడ్ ఆసుప త్రికి తరలించడం జరుగు చున్నదని తెలిపారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లో 210 పడకలు, ఐ.సి.యు. నందు 20 పడకలు ముందస్తుగా వైధ్య సేవలు అందించుటలో భాగంగా ఏర్పాటు చేయదమైనదని, నగిరిలో పాజిటివ్ గా వచ్చిన రెండు కేసులను జిల్లా కోవిడ్ ఆసుపత్రి నందు ఉంచి చికిత్స అందించడం జరుగుచున్నదని తెలిపారు. ఇక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరి రక్షణకు జిల్లా యంత్రాంగం వారికి అవసరమైన మాస్కులు, పి.పి.యు కిట్ లు, శ్యానిటైజర్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

 జిల్లాలో శ్రీకాళహస్తిలో నమోదైన తొలి కరోనా బాధితుడికి నెగటివ్ గా రిపోర్ట్ రావడంతో గురువారం డిశ్చార్జ్ కావడం జరిగిందని, డిశ్చార్జ్ అయిన తరువాత కూడా 14 రోజులు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు తెలపడం జరిగిందని, ఇది మన డాక్టర్ల సమిష్టి విజయమని అభినందించారు.. ప్రజలు కరోనా కట్టడికి సహకరిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని సామాజిక బాద్యతగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
----------------------------
- కోవిడ్19 ఆసుపత్రిలో 7రోజులు విధులు నిర్వహించిన డాక్టర్లు 14 రోజుల క్వారేంటైన్ తప్పనిసరి.
- కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి అందరికి ప్రత్యేక పి.పి.ఇ.లు, మాస్కులు 
- ఐఎంఏ, ప్రవేట్ డాక్టర్లు విధులు నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

 తిరుపతి, ఏప్రిల్ 09: కోవిడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు 7 రోజులు అందించిన డాక్టర్లు ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు తప్పనిసరి ప్రత్యేక క్వారేంటైన్ తీసుకోవాలని, వైద్యసేవల్లో అవసరమైన అన్నిరకాల కిట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. గురువారం ఉదయం స్థానిక రుయా ఆసుపత్రిలో వైద్యులతో సమావేశమై పలుసూచనలు చేశారు. కలెక్టర్ వివరిస్తూ డాక్టర్ల కు అన్ని విధాలా సౌకర్యాలకు సిద్ధంగా ఉన్నామని, వారి కుటుంబసంక్షేమ ప్రధానమని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో 7 రోజులు కోవిడ్ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన వారికి 14 రోజులు ప్రత్యేక క్వారేంటైన్ నిర్వహించాలని సూచిందని, హోమ్ క్యారేంటైన్ కు అనుమతి లేదని అన్నారు. మీకు కావలసిన గెస్ట్ హౌస్, లాడ్జిలలో అన్ని సౌకర్యాలు కల్పింస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రం ఆసుపత్రిలో పాజిటివ్ కేసులను ఉంచామని, వీలైనంత ప్రయణ దూరం తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఎక్కడ క్రిటికల్ కేసులు లేవని అన్నారు. డాక్టర్లు పూర్తి సెక్యూరిటీతో వెళ్లి వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి గానీ రుయా సూపర్నెంట్ దృష్టికి గానీ తీసుకుని వచ్చి సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలని అన్నారు. రుయాలో మెడిసిన్ వార్డు ఏర్పాటు రెండురోజుల్లో పూర్తి చేసి అందుబాటులో కి తీసుకు రావాలని అన్నారు. ప్రభుత్వ నుండి ఐఎంఏ, ప్రవేట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది జాబితా అందిందని, వారికి వేతనాలు ప్రభుత్వమే నిర్దేశించి అందించనున్నారు. ఏ క్షణం అయినా ఉత్తర్వులు రాగానే విధుల్లోకి రావలసి ఉంటుందని ఇప్పటికే మీకు సూచనలు అంది ఉంటాయని అన్నారు. ఒపిలో విధులు నిర్వహిస్తున్న వారు కూడా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని అనుమానం వస్తే వెంటనే క్యారేంటైన్ కు పంపాలని సూచించారు. అవసరాన్ని బట్టి నెగటివ్ కేసుల క్వారేంటైన్ కు ఇ.ఎస్.ఐ., అమర ఆసుపత్రి ఉపయోగించే విధంగా ఉండాలని అన్నారు. జిల్లాకు అందిన వివిద రకాల పిపిఇ లు, మాస్కులు డాక్టర్లు పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగివున్నాయని విషుల్లో ఉన్న డాక్టర్లు సంతృప్తి వ్యక్తం చేసారు. రుయా సూపర్నెంట్ రమణయ్య మొదటి పాజిటివ్ కేసు వ్యక్తిని డిస్జార్ చేస్తున్నామని మరికొన్ని రోజులు పాటించాల్సిన నియమాలను వివరించామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇది మీ విజయం అని ఇదే స్ఫూర్తితో సేవాలందించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రసూతి ఆసుపత్రికి కూడా అవసరమైన హెల్త్ సేఫ్టీ మెటీరియల్ అందించాలని సూచించారు.

 వికృత మాల హౌసింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
 భవిష్యత్ అవసరాల దృష్ట్యా క్వారేంటైన్ కు అవసరం ఉండవచ్చుని , 1580 గృహాలో అన్ని వసతులు కలిగి ఉండేలా సిద్ధంగా ఉంచాలని జెసి2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్, మంచి నీరు అందుబాటులో వున్నాయని మరోసారి శానిటేషన్ చేసి ఉంచుకోవాలని సూచించారు. 
----------------------------------

పి.పి.ఇ. కిట్లు పంపిణీ

కోవిడ్-19 పరీక్షలు వైద్యులు వినియోగించే పి.పి.ఇ.(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్. గిరిషా లు గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో వైద్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్- 19 పరీక్షల కోసమని 50 వార్డులకు గాను 50 మంది వైద్యులను, ఇద్దరు హెల్త్ సెక్రెటరీలను, ఒక ఏ. ఎన్. ఎం. లను నియమించడం జరిగిందన్నారు. వీరు ఆయా వార్డుల్లో ఉన్న ప్రజలకు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి పరీక్షలు చేసి, ఐసోలేషన్ కు తరలించే ఏర్పాట్లు చేస్తారన్నారు. ఈ సమయంలో వారి కి ఎటువంటి వైరస్ సోకకుండా ఈ ఈక్విప్మెంట్లను వినియోగిస్తారన్నారు. ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థ ఈ పి.పి.ఇ లను తెప్పించుకోవడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. ఉదయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*