కరోనా చిత్తూరు జిల్లా తాజా సమాచారం… 73 కేసులు

  • జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 73, ఇందులో డిశ్చార్జ్ అయిన వారు 11 మంది
  • భౌతిక దూరం పాటిద్దాం . . . కరోనా ను కట్టడి చేద్దాం
  • కరోనా కట్టడికి జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరం . . . జిల్లా యంత్రాంగం అప్రమత్తం

చిత్తూరు, ఏప్రిల్ 23: జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 73 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 11 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నేడు నమోదైన 14 పాజిటివ్ కేసుల్లో శ్రీకాళహస్తి – 5, తిరుపతి అర్బన్ -1, బి.ఎన్.కండ్రిగ -1, ఏర్పేడు -1, వరదయ్యపాలెం -1, పుత్తూరు – 1, చిన్నగొట్టిగల్లు -1, ఎర్రావారిపాలెం – 3 గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులుగా గల మొత్తం 73 కేసులకు సంబంధించి మండలాల వారీగా . . . శ్రీకాళహస్తి – 43 (డిశ్చార్జ్ -1), తిరుపతి -8 (డిశ్చార్జ్ -4), పలమనేరు -3 (డిశ్చార్జ్ -2), నగరి -4 (డిశ్చార్జ్ -1), నిండ్ర -2, బిఎన్ కండ్రిగ -1, ఏర్పేడు -2 (డిశ్చార్జ్ -1), రేణిగుంట-2 (డిశ్చార్జ్ -2), వరదయ్యపాలెం -1, పుత్తూరు -1, ఎర్రావారిపాలెం -3, చిన్నగొట్టిగల్లు -1, వడమలపేట -1, చంద్రగిరి -1 గా కలవని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,740 శ్యాంపిల్ టెస్టింగ్ చేయగా అందులో 3,894 ఫలితాలు రాగా, 1,846 ఫలితాలు అందవలసి ఉన్నదని, జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్ సెంటర్ల నందు 1,740 పడకలు కలవని, ఇందులో ప్రస్తుతం 414 మంది కలరని, జిల్లా వ్యాప్తంగా గల 26 రిలీఫ్ క్యాంపుల నందు ఇప్పటి వరకు 2,111 మందికి వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో మొత్తం విదేశాల నుండి వచ్చిన వారు 1,816 మంది అని, వీరందరికీ 28 రోజులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం హాట్ స్పాట్లు 16 కలవని, అందులో రూరల్ లో 12, అర్బన్ లో 4 కలవని తెలిపారు. జిల్లాలో రోజు వారీ శ్యాంపిల్ ల సేకరణ కార్యక్రమం జరుగుతున్నదని, ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ర్యాండమ్ గా శ్యాంపిల్ సేకరణతో పాటు రెడ్ జోన్ లలో పాజిటివ్ కేసులు వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల వారికి కూడా వెంటనే పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని క్వారంటైన్ కు తరలించడం జరుగుతున్నదని తెలిపారు. మండల స్థాయిలో గల టీమ్ లు మరింత చురుకుగా పని చేయాలని, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లు పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించుటకు సిద్ధంగా ఉండేలా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పూర్తి అప్రమత్తంగా ఉన్నదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అధికారులకు సూచించామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*