కరోనా…చిత్తూరు జిల్లా తాజా పరిస్థితి

  • జిల్లాలో ఇప్పటి వరకు 444 శ్యాంపుల్స్ సేకరించగా అందులో 374 నెగిటివ్..
  • శ్యాంపుల్స్ ఫలితాలు అందవలసినవి 50..
  • జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 20..
  • జిల్లాలో సర్జికల్ మాస్కు లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యూప్మెంట్ కిట్, శ్యాని టైజర్లు అవసరం మేరకు పంపిణి చేశాం :జిల్లా కలెక్టర్.

చిత్తూరు, ఏప్రిల్ 08 , సమయం‌ సాయంత్రం 5 : జిల్లాలో ఇప్పటి వరకు 20 పాజిటివ్ కేసులు నమోదుకావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 వ తేదిన నమోదైన 3 కేసులలో నగిరి-2, తిరుపతి-1 నిర్ధారణ అయినట్లు, ఈ పాసిటివ్ కేసులకు సంబందించి గతంలో పాసిటివ్ కేసులు వచ్చిన వారితో సంబంధం ఉన్నవారని తెలిపారు. నగిరి క్వారంటైన్ లో ఉన్న ఇద్దరిని చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి, తిరుపతి క్వారంటైన్ లో ఉన్న వారిని స్విమ్స్ హాస్పిటల్ కు తరలించడమైనదని తెలిపారు. జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని 14 క్వారంటైన్ లో 450 మంది ఉన్నారని, విధేశాల నుండి జిల్లాకు వచ్చిన వారు 1816 అని వారందరికి 14 రోజులు పూర్తయ్యి, 28 రోజుల మధ్య ఉన్నారని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చిన వారికి వసతి, భోజనం సౌకర్యం లో భాగంగా 28 రిలీఫ్ షెల్టర్ లలో 1789 మంది కలరని తెలిపారు. జిల్లాలో మాస్కులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యూప్మెంట్ కిట్, శ్యానిటైజర్లకు కొరత లేదని అవసరం మేరకు పంపిణి చేశామని, ఇప్పటి వరకు సర్జికల్ త్రీ లేయర్స్ మాస్కులు 4 లక్షల 20 వేలు, యన్ 95 మాస్కులు దాదాపు 5 వేలు, జిల్లాలోని వివిధ పి.హెచ్.సి లకు, తిరుపతి, స్విమ్స్, రుయా ఆసుపత్రులకు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి, పోలీసు వారికి పంపిణి చేయడమైనదని, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యూప్మెంట్ కిట్ లు, వివిధ ఆసుపత్రులకు అవసరం మేరకు పంపిణి చేయడమైనదని, 15,350 లీటర్ల శ్యానిటైజర్స్ వివిధ ఆసుపత్రులకు, క్షేత్ర స్థాయి సిబ్బందికి అందజేయడమైనదని, దీనితో పాటు రోజుకు 50 నుండి 60 వేల మాస్కులు, పి.పి.కిట్ లు 500 అందడం జరుగుతున్నదని వీటన్నిటిని హాస్పిటల్స్, యం.పి.డి.ఓ కార్యాలయాలకు, పి.హెచ్.సి లకు పంపిణి చేయడం జరుగుతున్నదని తెలిపారు. టి.టి.డి వారు స్విమ్స్ హాస్పిటల్ కు ఎక్యూప్మెంట్ కొనేందుకు నిధులు మంజూరు చేయడమైనదని, ఈ.సి.జి.మిషన్లు, ఇతర సంబందిత ఎక్యూప్మెంట్లు కొనడం జరిగిందని, అదనంగా 20 వెంటిలేటర్లు రావడం జరుగుతుందని, దీనితో పాటు మొత్తం 100 వెంటిలేటర్లు పద్మావతి మెడికల్ కాలేజీలో తయారు చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. జిల్లా సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కు దాదాపు 565 కాల్స్ రావడం జరిగిందని, కరోనా కు సంబందించిన సమాచారం కొరకు కాల్స్ చేసే వారికి ఎప్పటికప్పుడు తగు సమాచారం అందిచడం జరుగుచున్నదని తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబందించిన వారు మూడు షిఫ్ట్ లలో 24 గంటలు పని చేయడం జరుగుచున్నదని, కరోనా కు సoబందించి వైధ్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి టోల్ ప్రీ నెంబర్ : 1100, ఆరోగ్య సలహా మేరకు 104 పరీక్షా కేంద్రాల వివరాల కోసం 0866-2410978, తగు సహాయం కొరకు 7013387382, 8008473799, జిల్లా కమాండ్ కంట్రోల్ కాల్ సెంటర్ 9849902379 కి సంప్రదించవచ్చునని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*