కరోనా : చిత్తూరు జిల్లా సమగ్ర సమాచారం

  • చిత్తూరు జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్, వెంటిలేటర్స్, మందుల కొరత లేదు : జిల్లా కలెక్టర్
  • జిల్లాలో ఈ నెల 29 వరకు మొత్తం పాజిటివ్ కేసులు 10,051 – ఇందులో యాక్టివ్ కేసులు 4,345 – డిశ్చార్జ్ 5,590

చిత్తూరు, జులై 30 : జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న కోవిడ్ – 19 కేసులకు సరిపడా అన్ని వైద్య సదుపాయాలు, సౌకర్యాలను జిల్లా కోవిడ్ ఆస్పత్రులలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో 4,211 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 165 వెంటిలేటర్లు కలిగిన బెడ్స్, మందులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. కోవిడ్ ఆస్పత్రి వారీగా ప్రస్తుతం ఉన్న బెడ్స్ వివరాలను జిల్లా కలెక్టర్ వివరిస్తూ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి (స్విమ్స్) నందు నాన్ ఐసియు – నాన్ ఆక్సిజన్ బెడ్స్ -320, ఐసియు బెడ్స్ – 130 మొత్తం 450 బెడ్లు మరియు 92 వెంటిలేటర్లు, డిస్ట్రిక్ట్ కోవిడ్ ఆసుపత్రులైన తిరుపతి రుయా నందు నాన్ ఐసియు – నాన్ ఆక్సిజన్ బెడ్స్ -174, నాన్ ఐసియు ఆక్సిజన్ – 376, ఐసియు బెడ్స్ – 42 మొత్తం 592 బెడ్లు మరియు 50 వెంటిలేటర్లు ఉన్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు నాన్ ఐసియు – నాన్ ఆక్సిజన్ బెడ్స్ – 200, ఐసియు బెడ్స్ – 20 మొత్తం 220 బెడ్స్, 18 వెంటిలేటర్లు, కోవిడ్ కేర్ ఆసుపత్రులైన తిరుపతి ఈఎస్ఐ నందు నాన్ ఐసియు – నాన్ ఆక్సిజన్ బెడ్స్ -68, నాన్ ఐసియు ఆక్సిజన్ – 32, ఐసియు బెడ్స్ – 45 మొత్తం 150 బెడ్లు, 5 వెంటిలేటర్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయిన పిఈఎస్ నందు నాన్ ఐసియు – నాన్ ఆక్సిజన్ బెడ్స్ -150, నాన్ ఐసియు ఆక్సిజన్ – 30 మొత్తం 180 బెడ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో భాగంగా పద్మావతి నిలయం నందు 719, శ్రీనివాసం నందు 1,100, విష్ణు నివాసం నందు 800 మొత్తం 4,211 బెడ్స్ కలవని, ఇందులో ఈ నెల 29వ తేది నాటికి 2,504 బెడ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఐఎంఏ వారి సమన్వయంతో జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోవిడ్ పాజిటివ్ బాధితులకు వైద్య సేవలందించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ప్రైవేట్ హోస్పిటల్స్ అయిన అమర హాస్పిటల్లో నాన్ ఐసియు బెడ్స్ 15, ఐసియు బెడ్స్ 35 మొత్తం 50 బెడ్లు, 12 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి నందు 9 నాన్ ఐసియు బెడ్స్, 15 ఐసియు బెడ్స్ మొత్తం 24 బెడ్స్ మరియు 5 వెంటిలేటర్లు, సంకల్ప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు 30 నాన్ ఐసియు బెడ్స్, 5 ఐసియు బెడ్స్ మొత్తం 35 బెడ్స్, 4 వెంటిలేటర్లు, పూర్ణస్ రెమెడీ నాన్ ఐసియు 33 బెడ్స్, 12 ఐసియు బెడ్స్ మొత్తం 45, 2 వెంటిలేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతి కెఆర్ హాస్పిటల్ నందు 14 నాన్ ఐసియు బెడ్స్, 8 ఐసియు బెడ్స్ మొత్తం 22 బెడ్స్ మరియు 1 వెంటిలేటర్, శ్రీ రమాదేవి ఆసుపత్రి నందు 5 నాన్ ఐసియు బెడ్స్, 5 ఐసియు బెడ్స్ మొత్తం 10 బెడ్స్ మరియు 2 వెంటిలేటర్లు, లోటస్ ఎమర్జెన్సీ ఆసుపత్రి నందు 33 నాన్ ఐసియు బెడ్స్, 12 ఐసియు బెడ్స్ మొత్తం 45 బెడ్స్, 2 వెంటిలేటర్లు ఉన్నాయి. డిబిఆర్ & ఎస్ కె ఆసుపత్రి నందు 10 ఐసియు బెడ్స్ మరియు 2 వెంటిలేటర్లు, తిరుపతి శ్రీ హోస్పిటల్స్ నందు 10 ఐ సి యు బెడ్స్ మరియు 3 వెంటిలేటర్లు కలవని ఈ ప్రైవేట్ ఆసుపత్రిలలో కోవిడ్ – 19 కు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

21 ట్రూనాట్ మెషిన్ల ద్వారా పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, ఈ ట్రూనాట్ మెషిన్లు తిరుపతి (రుయా ఆసుపత్రి-6, మెటర్నిటీ ఆసుపత్రి-1), స్విమ్స్ – 1, చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి-5, పలమనేరు-4, మదనపల్లె-4 ఆసుపత్రులలో ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లాలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలు కలిగిన సంజీవని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, 3 సంజీవని తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తిలలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఇది కాక 4 ప్రైవేట్ మొబైల్ వాన్స్ కూడా తిరుపతి స్విమ్స్, రుయా, అలిపిరి టోల్ గేట్, తిరుమలలలో అందుబాటులో ఉంచబడిందని తెలిపారు. మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తి, నగరి, కుప్పం లోని ఏరియా ఆసుపత్రులలో కోవిడ్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ నమోదైన వ్యక్తుల వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ ఇసోలేషన్, ఇసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ లకు సిఫారసు చేయడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లాలో ఈ నెల 29 వరకు 1,68,983 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 10,051 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని, ఇందులో యాక్టివ్ కేసులు 4,345, డిశ్చార్జ్ 5,590 జరిగిందని, 108 మంది మరణించడం జరిగిందని తెలిపారు. డిశ్చార్జ్ అయిన కోవిడ్ బాధితులకు వారందరికి ప్రభుత్వం తరఫున రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో 24 x 7 కాల్ సెంటర్ పని చేస్తున్నదని కరోనా నియంత్రణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై 9 లక్షల కరపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని, 7,092 పోస్టర్లు కూడా పంపిణీ చేశామని, నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో సర్వైలెన్స్ టీంలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నోడల్ అధికారులు ట్రయేజ్ సెంటర్ వైద్యులు, 104 కంట్రోల్ రూమ్ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, ఇతర అధికారులు పారిశ్యుధ్య కార్మికులు అందరూ కరోనా నియంత్రణలో భాగస్వామ్యులయ్యారని, వీరందరూ కోవిడ్ – 19 బాధితులకు అండగా ఉంటారని తెలిపారు.

జిల్లాలో కోవిడ్ – 19 కి సంబంధించి పరీక్షలు, అడ్మిషన్లు, కోవిడ్ కేర్ సెంటర్ల సంబంధిత వివరాల కొరకు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సమాచారం కోసం 9849902379, కంట్రోల్ రూమ్ నెంబర్లు 08572- 242731, 242734. కోవిడ్ కేంద్రాల సమాచారం కొరకు ఈ కింద కనపరచిన నెంబర్లకు సంప్రదించవచ్చునని తెలిపారు. పద్మావతి నిలయం -9550438574, శ్రీనివాసం – 8790543043, విష్ణు నివాసం – 9346130558, ఎస్ వి ఆర్ ఆర్ రుయా వైద్యశాల – 9441486168, స్విమ్స్ – 9003093816 లకు ఫోన్ చేసి కోవిడ్ కేర్ కేంద్రాల వివరాల కొరకు సంప్రదించ వచ్చునని ఆ ప్రకటనలో తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*