కరోనా తాజా సమాచారం : రాష్ట్రంలో ‌2018 కేసులు…చిత్తూరు జిల్లాలో 9 కేసులు

రాష్ట్రంలో కరుణ కేసుల సంఖ్య 2018 పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి.‌ ఇందులో అనంతపురం 8, చిత్తూరు 9, కర్నాలు 9, నెల్లూరు 1, గుంటూరు‌ 5, కృష్ణా 3, విశాఖపట్నం 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 998 మంది డిస్ ఛార్జి‌ అయ్యారు.‌ 975 మంది‌ ఆస్పత్రుల్లో ఉన్నారు. 45 మంది మరణించారు.

చిత్తూరు జిల్లాలో తాజాగా నమోదైన 9 కేసుల్లో 8 కేసులు కోయంబేడు మూలాలున్నవే కావడం విశేషం. ఈ కేసుల్లో తిరుపతి 2 ఉన్నాయి. ‌తిరుపతి నెహ్రూ నగర్ కి చెందిన ఒకరికి, ఎల్.బి. నగర్ కు చెందిన ఓ మహిళకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. తిరుపతిలో మొత్తం మూడు యాక్టివ్ కేసులున్నాయి. ఈ ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.‌

11.05.2020 ఉదయం 10 గంటల బులిటెన్ సమాచారం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*