కరోనా బాధితులు…పోలింగ్ కేంద్రానికి వెళ్లనవసరం లేదు.. పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయం..!

కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధానంలో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 65 ఏళ్లలు దాటిన వృద్ధులకు; కరోనా బాధితులు, అనుమానితులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి‌ కసరత్తు చేస్తోంది. దీనివల్ల అక్రమాలు జరుగుతాయని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇప్పటిదాకా…ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది. కరోనా పేరుతో ఈ సదుపాయాన్ని 65 ఏళ్లుదాటిన వారితో పాటు, కరోనా సోకిన వారికి, అనుమానితులకూ వర్తింపజేయడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సిద్ధంచేసి కేంద్రానికి పంపింది.‌ దీనికి కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ఉద్యోగులకు ఉన్న పోస్టల్ బ్యాలెట్ లోనే భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, అటువంటిది కరోనా పేరుతో అందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తే అక్రమాలు ఇంకా పెరుగుతాయని, ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని సిపిఎం‌ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రాజకీయపక్షాలతో చర్చించిన మీదటే నిర్ణయం తీసుకోవాలని ఎ‌న్నికల సంఘానికి లేఖ రాసింది. నవంబర్ లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో అధికార బిజెపికి మేలు చేకూర్చడం కోసమే హడావుడిగా ఈ మార్పులు చేస్తున్నారని‌ ఆ పార్టీ ఆరోపిస్తోంది.

అయితే…ఎన్నికల సంఘం నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రానున్న‌ రోజుల్లో ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉంది. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*