కరోనా…వార్తా పత్రికల ప్రచురణా బంద్ చేస్తారా..!

కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వాలు‌ అనేకమైన చర్యలు చేపడుతున్నాయి. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, దేవాలయాలు…ఇలా అన్నీ మూసేస్తున్నారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ పేరుతో దేశవ్యాపితంగా జనం తమను తాము స్వచ్ఛందంగా ఇంట్లో నిర్భందించుకునే చర్యకు ఉపక్రమిస్తున్నారు.

చైనా వంటి దేశాల అనుభవం చూస్తుంటే ఈ చర్యలు సరిపోయేలా లేవు. మరిన్ని చర్యలూ అవసరమయ్యేలా ఉన్నాయి. నిత్యం మన ఇంటికి వచ్చే దినపత్రికల ద్వారానూ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. పత్రిక ముద్రణ జరిగినప్పటి నుండి చాలామంది చేతులు మారి పాఠకులకు చేరుతుంది. ఈ‌ క్రమంలో ఒకరికి వైరస్ ఉ‌న్నా…వందలు, వేల కుటుంబాలు వైరస్ బారినపడే ప్రమాదముంది. కాగితంపై కనీసం 24 గంటల పాటు వైరస్ ఉంటుందట. అందుకే చైనాలో కరెన్సీపైనా నియంత్రణ విధించింది.

ఈ పరిస్థితుల్లో మన దేశంలోనూ దినపత్రికలూ కొంతకాలం ప్రచురణ అపేస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అవసరమైతే ఇ-పేపర్ రూపంలో ప్రజలకు సేవలు‌ అందించవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం చేరవేయడానికి మార్గాలున్నాయి. అందువల్ల పత్రికల ప్రచురణ తాత్కాలికంగా నిలిపివేసినా పెద్ద నష్టమేమీ ఉండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*