కరోనా విపత్తు వేళ…సిపిఎం‌ నిజమైన స్ఫూర్తి..!

కరోనా మహమ్మారిని విజృంభిస్తున్న వేళ…మాటలు కాదు చేతలు కావాలి. ఎప్పుడూ రాజకీయ విమర్శలే కాదు…ఇటువంటి‌ సమయంలో ప్రభుత్వాలకు యావత్ జాతి సంఘీభావం‌ అవసరం.‌

ప్రజలను కరోనా భూతం నుంచి రక్షించడానికి సిపిఎం స్ఫూర్తిదాయకైన నిర్ణయం తీసుకుంది. తమ కార్యకర్తలు‌ ఎటువంటి సేవలు‌ అందించడానికైనా సిద్ధంగా ఉన్నారని, ఎలా ఉపయోగించు కుంటుందో‌ ప్రభుత్వం ఇష్టమని‌ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. సిపిఎంకు లక్షలాది‌ కార్యకర్తలున్నారు. వారని ఎలా వాడుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలి.

సిపిఎం అనంతపురం కార్యదర్శి రాంభూపా ప్రకటన ఒకటి పత్రికల్లో కనిపించింది. తమ పార్టీ కార్యాలయాలను కరోబా పరిచర్తల కోసం వినియోగించుకోవచ్చన్నది ఆ ప్రకటన సారాంశం. నిజంగా ఇదొక స్ఫూర్తిదాయకమైన నిర్ణయమని చెప్పాలి. సిపిఎకు ప్రతి జిల్లాలోనో పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నాయి.‌ వాటిని‌ కరోనా బాధితుల కోసం ఇవ్వాలనుకోవడం అభినందనీయం. దేశంలోని‌ అన్ని పార్టీలకూ సిపిఎం ఆదర్శంగా నిలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*