కరోనా వేళ మీ సెల్‌ఫోన్‌ జాగ్రత్త..! లేకుంటే ఏమవుతుందో తెలుసా..?

చేతిలో సెల్‌ఫోన్‌ లేనిదే క్షణం గడవదు. కరోనా లాక్‌ డౌన్‌ వేళ, ఇంట్లోనే బందీలై ఉన్న సమయాన, స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే ఎలా పొద్దుపోతుందో అని అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాంటే సెల్‌ఫోన్‌ మన శరీరంలో భాగంగా మారిపోయింది. నిత్యావసర వస్తువుగా పరిణమించింది. మన దేశంలో నెలకు 2.5 కోట్ల సెల్‌ఫోన్లు అమ్ముడ వుతున్నాయి. దేశం మొత్తంమ్మీంద 85 కోట్ల ఫోన్లు ఉన్నట్లు అంచనా.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి సెల్‌ఫోన్‌ దుకాణాలు మూతపడ్డాయి. తయారీ పరిశ్రమలూ మూసేశారు. రిపేరు షాపులు కూడా లేదు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లకూ అవకాశం లేదు.

సాధారణంగానే…. రకరకాల కారణాతో సెల్‌ఫోన్లు పాడైపోతుంటాయి. సాధ్యమైతే రిపేరు చేయిస్తారు. లేదంటే కొత్తది కొంటారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేదాకా నాలుగు కోట్ల సెల్‌ఫోన్లు పాడైపోవచ్చునని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ అంచనా వేసింది. అంటే లాక్‌డౌన్‌ ముగియగానే నాలుగు కోట్ల సెల్‌ఫోన్లకు డిమాండ్‌ ఉంటుందన్నమాట. అదీ మే 3 నాటికి లాక్‌డౌన్‌ ముగిస్తే. కొనసాగితే పాడయ్యే సెల్‌ఫోన్లు నాలుగు కోట్లకు మించి ఉండవచ్చు.

అందుకే…సెల్‌ఫోన్లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చాని సెల్యులార్‌ కంపెనీల అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందట. ప్రభుత్వం దీనిపైన ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదట. ఇప్పుడు అర్థమయిందా, మీ మొబైల్‌ను ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలో. ఇప్పుడు మొబైల్‌పాడైతే, లాక్‌డౌన్‌ ముగిసి, దుకాణాలు తెరిచేదాకా గోళ్లు గిళ్కుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*