కరోన కట్టడికి శ్రీకాళహస్తిలో పటిష్ట చర్యలు

  • పలుశాఖల సమన్వయంతో పనులు
  • ఏడు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయాలు
  • ప్రతి ఒక్కరూ దూరం పాటించేలా ఏర్పాట్లు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి శ్రీకాళహస్తి కి కూడా సోకడంతో దీనిని మరొకరికి వ్యాపించకుండా అధికారులు, పాలకులు పడుతున్న తంటాలు అంతా ఇంతాకాదు. జిల్లాలోనే మొదటి కరోనా పాజిటివ్ కేసు శ్రీకాళహస్తిలో నమోదవడంతో ఈవ్యాధి మరొకరికి వ్యాపింకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. తాజాగా కూరగాయల విక్రయ కేంద్రాలను పలు ప్రాంతాల్లో విస్తరింపజేసి జన సమూహం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

కూరగాయల కొనుకోలు కోసం దూరదూరంగా నిలుచున్న జనం

కరోనా వ్యాపించకుండా చర్యలు...
రాయలసీమ జిల్లాల్లోనే మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు శ్రీకాళహస్తిలో నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మొత్తం ఇప్పుడు శ్రీకాళహస్తి మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి కి విచ్చేసి స్థానిక అధికారులకు తగు సూచనలు ,తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. దీంతో పట్టణంలో పారిశుద్ధ్య ం మెరుగుపరచడం ,రసాయనాలు చల్లడం వంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. మున్సిపల్, పోలీసులు, రెవెన్యూ, ఇటు దేవస్థానం అధికారులు సైతం కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి స్వయంగా రోడ్ల మీద కు వచ్చి పనులను పరిశీలించడమేగాక ప్రజలను గుంపులుగా ఉండొద్దని వేడుకుంటున్నారు. మరోవైపు అనాధలు, యాచకులను ఆదుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారి ఆకలి తీర్చి ఆదుకుంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ

ఏడు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయాలు..
పట్టణంలో నిన్నటి వరకు కూరగాయల మార్కెట్ వద్ద మాత్రమే సరుకులు విక్రయించేవారు. దీంతో విఫరీతంగా రద్దీ నెలకొనేది. తద్వారా కరోనా వచ్చే అవకాశం ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు శనివారం నుంచి పట్టణంలో ని ఏడు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద పాత ఆర్టీవో కార్యాలయం వద్ద, వారపు సంత జరిగే ప్రాంతం అగ్రహారం వద్ద ఉన్న బాలుర ఉన్నత పాఠశాల, ఆక్స్ ఫర్డ్ డిగ్రీ కాలేజ్ ,ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, భాస్కర్ పేట ప్రభుత్వ పాఠశాల ప్రాంతాల్లో కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో మనిషికి, మనిషి దూరం ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారు. దీంతో కరోనా వ్యాప్తిని కొంత వరకు అరికట్టగలు గుతున్నారు. మరోవైపు పట్టణంలో ఉన్న సూపర్ బజార్ ల ద్వారా నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసే ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా షాపుల పేర్లు, ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు.

విక్రయ కేంద్రాలకు ప్రత్యేక పరిశీలకులు.
పట్టణంలో ఏడు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయాలు సక్రమంగా జరిగేలా ప్రత్యేక పరిశీలకులు ఏర్పాటు చేశారు. ముక్కంటి దేవస్థానం నుంచి21మంది ఉద్యోగుల ను మున్సిపాలిటీ కి అప్పగించారు. ప్రతి విక్రయ కేంద్రం వద్ద ఒక మున్సిపల్, దేవస్థాన ఉద్యోగి ,పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే సూపర్ మార్కెట్ ల నుంచి సైతం సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అన్నిశాఖల అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, పలు స్వచ్ఛంద సంస్థలు కరోనా నివారణలో భాగస్వామ్యులై పనిచేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*