కర్ణాటకలో దొంగ పోలీస్ ఆట ప్రారంభం

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయ పార్టీలు బేరసారాలు మొదలుపెట్టాయి. ఎదుటి పక్షం నుంచి సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో తమ సభ్యులు ప్రత్యర్ధుల వలకు చిక్కకుండా ఉండేందుకు రహస్య ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బిజెపి – కాంగ్రెస్, జెడిఎస్ తమ సభ్యులను సురక్షితం చేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తొమ్మిది మంది సభ్యులు తక్కువగా ఉన్న బిజెపి ఎలాగైనా కాంగ్రెస్ , జిడిఎస్ ఎమ్మెల్యే లను పట్టుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యులు తమకు ఉన్నారని బిజెపి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జెడిఎస్ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారట. అధిష్టానం నిర్వహించిన సమావేశానికి ఐదు మంది శాసనసభ్యులు హాజరు కాలేదట. వీరంతా ఎక్కడున్నారో తెలియదు కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ 5 మంది బిజెపి క్యాంపులో కి వెళ్లి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కనిపించకుండా పోయిన వారిలో ఆమ్నాబాద్‌ ఎమ్మెల్యే రాజశేఖర్‌ బి. పాటిల్‌, నగేంద్ర(కూడ్లగి‌), ఆనంద్‌ సింగ్‌(విజయ నగర)తో పాటు భీమా నాయక్‌, అమేర్‌ గౌడ నాయక్‌ తదితరులు ఉన్నారట. ఇదే నిజమైతే బీజేపీకి మరో నలుగురు సభ్యులు మాత్రమే తక్కువవుతారు. ఇటువంటి బేరసారాలకు అవకాశం లేకుండా వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరో ఒకరిని గవర్నర్ ఆహ్వానించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కర్ణాటకలో కర్ణాటకలో ఒక్కో సభ్యుడికి ధర రూ.75 కోట్లు పలుకుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో 224 శాసనసభా స్థానాలు ఉండగా 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీకి 104 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కు 78 లభించాయి. జనతా దళ్ 30 స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 అవసరం. కాంగ్రెస్ జెడిఎస్ కలిస్తే 116 సభ్యులు అవుతారు. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఈ సంఖ్య సరిపోతుంది. అయితే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని బిజెపి గవర్నర్ కోరింది. జేడీఎస్ కు తాము మద్దతిస్తామని, తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కాంగ్రెస్ అడిగింది. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. దీనివల్ల అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ తమ సభ్యులను కాపాడుకోవడంతో పాటు ఎదుటి పక్షం లో ని వారిని తమ వైపు తిప్పుకోవ డానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ‘దొంగ పోలీసు’ ఆటకు తెరపడాలంటే గవర్నర్ వెంటనే ఎవరో ఒకరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*