కర్నాటకలో బిజెపిని గెలిపించిన టిడిపి!

రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి కర్నాటక ఎన్నికల్లో బుద్ధిచెబుతాం అంటూ టిడిపి నేతలు ప్రచారం హోరెత్తించారు. తిరుపతి ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుప్రజలు ఎక్కడున్నా బిజెపికి బుద్ధిచెప్పాలంటూ కర్నాటక ఎన్నికలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. కర్నాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించాలంటూ చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి కార్యకర్తలు బెంగుళూరుకు యాత్రలు నిర్వహించారు. కన్నడనాట బిజెపి ఓడిపోవాలని, కాంగ్రెస్‌ గెలవాలని టిడిపి త్రికరణశుద్ధిగా కోరుకుంది. అయితే టిడికి ఆశలను, ఆకాంక్షలను నీరుగారుస్తూ బిజెపికి గెలిచింది. బిజెపిని ఓడించడానికి టిడిపి చేసిన ప్రచారం ఒక విధంగా కమలానికి మేలు చేసిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అదెలాగంటే…

కర్నాటకలో తెలుగువారు స్థిరపడినమాట వాస్తవం. అందులో తెలంగాణవారూ ఉన్నా అత్యధికులు రాయలసీమ జిల్లాల నుంచి వెళ్లినవారే. సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో వైసిపికి పట్టువుంది. అంటే కర్నాటకలోని తెలుగువారిలో వైసిపి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం వైపిసితో ఉన్న వర్గాలు గతంలో కాంగ్రెస్‌తో ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత జగన్‌మోహన రెడ్డితో ఉన్నారు. కర్నాటకలో జగన్‌ పార్టీ లేదుకనుక..వీరంతా కాంగ్రెస్‌కు మద్దతుదారులుగానే ఉండాలి. కానీ….బిజెపి ఓడించాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని టిడిపి తీసుకున్న వైఖరి కారణంగా…కర్నాటకలోని జగన్‌ అభిమానులు రివర్స్‌ అయ్యారు. బిజెపికి అనుకూలంగా మారారు. టిడిపి ఆశించినట్లు కర్నాకటలో కాంగ్రెస్‌ గెలిస్తే…ఆంధ్రప్రదేశ్‌లో పచ్చతమ్ముళ్లు మరింత రెచ్చిపోతారన్న అభిప్రాయమూ కర్నాకటలో స్థిరపడిన వైసిపి అభిమానుల్లో ఉంది. కర్నాకటలో కాంగ్రెస్‌ గెలవడమంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రద్రేశ్‌లో జగన్‌కు ఇబ్బంది కలిగించడమే అనే భావన కూడా ఉంది. అందుకే గతం నుంచి కాంగ్రెస్‌ను అభిమానించిన వారు కూడా…ఈసారి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులే అంగీకరిస్తున్నారు.

కర్నాకటలో కాంగ్రెస్‌ ఓటమిని టిడిపి ఓటమిగా అభివర్ణిస్తున్నవారూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ గెలుపు కోసం టిడిపి అంత తీవ్రంగా ప్రయత్నించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు ఉంది. ముందుగా కర్నాటక ఎన్నికల్లో ప్రయోగం చేయడానికి పూనుకున్నారు. అయితే ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఓటమిమి తెలుగుదేశం పార్టీ ఓటమిగా బిజెపి నేతలు పేర్కొంటున్నారు. పక్కరాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి టిడిపి అతిగా జోక్యం చేసుకుందన్న విమర్శలూ ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*