కర్నాటక ఎంఎల్‌ఏలు విమానం ఎక్కడానికి ఎందుకు భయపడ్డారు!

కర్నాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దేశమంతా సినిమా చూస్తున్నట్లు చూస్తోంది. అంత ఆసక్తిగా సాగుతున్నాయి అక్కడి వ్యవహారాలు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలమున్న కాంగ్రెస్‌, బిడిఎస్‌ కూటమిని కాదని; ప్రభుత్వ ఏర్పాటుకు 9 మంది సభ్యుల అవసరమున్న బిజెపిని గవర్నర్‌ ఆహ్వానించడం, బల నిరూపణకు 15 రోజులు గడువు ఇవ్వడం, దీనిపై సుప్రీం కోర్టు అర్ధరాత్రి విచారణ జరపడం, ఒక్క రోజులోనే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించడం…ఇవన్నీ చకచక జరిగిపోయాయి. బిజెపి వలకు చిక్కకుండా తన ఎంఎల్‌ఏలను కాంగ్రెస్‌, జెడిఎస్‌ హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తక్షణమే బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం ఆదేశించడంతో వెంటనే హైదరాబాద్‌లో ఒక రోజు కూడా బస చేయకుండానే బయలుదేరాల్సివచ్చింది. 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు బల నిరూపణ కాగా, 18వ తేదీ రాత్రే హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. విమానంలో బెంగుళూరు వెళ్లాలని నిర్ణయించుకుని, రెండు ప్రత్యేక విమానాలనూ సిద్ధం చేసుకున్నారు. ఆ విమానాలు బెంగుళూరులో దిగడానికి కూడా అనుమతి లభించింది. అయితే…చివరి నిమిషంలో విమానంలో కాకుండా బస్సుల్లో ఎంఎల్‌ఏలంతా బయలుదేరారు. విమానం ఎక్కడానికి భయపడ్డారు. ఇంతకీ ఎందుకు భయపడ్డారు?

ప్రధాన మంత్రి మోడీ ఎంత నక్కజిత్తుల వ్యవహారం గురించి బాగా తెలిసిన కాంగ్రెస్‌, జెడిఎస్‌ తమ ఎంఎల్‌ఏలను విమానంలో కాకుండా బస్సుల్లో తీసుకెళ్లాయి. విమానంలో ఎక్కిన తరువాత….బెంగుళూరులో దింగేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దించేస్తే….బల పరీక్షకు అందుకోలేమన్నది వారి ఆందోళన. అదీ వాస్తవమే. విమానాలు బెంగుళూరులో దిగడానికి సాంకేతిక సమస్య ఉందని చెబితే కాదనేదానికి ఏమీవుండదు. ఎక్కడో తీసుకెళ్లి దించేస్తే…మళ్లీ అక్కడి నుంచి రావాలంటే విమానాలు సిద్ధం చేసుకోవాలి. ఉదయానికల్లా సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందుకోవడం కష్టమే. ప్రమాణ స్వీకారం చేయకుంటే బల పరీక్షలో ఓటు వేసే అవకాశం ఉండదు. ఇవన్నీ ముందస్తుగా ఆలోచించి ఎంఎల్‌ఏను ఎయిర్‌ బస్సుల్లో కాకుండా బస్సుల్లో తరలించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*