కర్నాటక ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారో ఎవరికైనా తెలుసా?

కర్నాటక ఎన్నికల్లో 104 స్థానాలు గెలచుకుని బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బిజెపికి కొత్త అధ్యక్షునిగా నియమితులైన కన్నా లక్ష్మీ నారాయణ…’బిజెపిని ఓడించడానికి కుయుక్తులు పన్నిన చంద్రబాబుకు చెప్పుదెబ్బలాంటిది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని మరో బిజెపి నేత అన్నారు. కర్నాకటలో కాంగ్రెస్‌ ఓటమిని టిడిపి ఓటమిగా అభివర్ణించారు. ఫలితాలు వెలవడటం మొదలైనప్పటి నుంచి బిజెపి నాయకులు చంద్రబబుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు కర్నాకట ఎన్నికల ఫలితాలపై స్పందించిన దాఖలాలు లేవు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బిజెపికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టిడిపి కార్యకర్తలు కర్నాకటకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కర్నాటకలో బిజెపి ఓటమిపాలైతే దాన్ని దేశ వ్యాపితంగా నిలువరించగలమని చంద్రబాబు భావించారు. అయితే ఫలితాలు నిరాశ కలిగించాయి. అయినా టిటిడి జాతీయ నాయకుడిగా చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఫలితాలు దేశ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పివుండొచ్చు. బిజెపి ఎలా గెలిచిందో వివరించివుండొచ్చు. లేదా…ప్రభుత్వ ఏర్పాటుకు ఎవర్ని పిలవాలని అనుకుంటున్నారో అదైనా చెప్పివుండొచ్చు. ఎక్కడో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్‌-జనతాదళ్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్‌ చేశారు. పక్కనే ఉన్న కెసిఆర్‌…ఈ ఫలితాలు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు మేలు చేస్తాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని అధికారం, డబ్బులను అడ్డుపెట్టుకుని బిజెపి గెలిచిందని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు. కర్నాటక ఫలితాలు వస్తున్న సమయంలోనే శ్రీకాకుళంలో ఓ సభలో పాల్గొన్నా అక్కడ కూడా ఎన్నికల గురించి నోరువిప్పలేదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*