కల్యాణ వేంకటేశ్వరా… నీకు తలనీలాల మొక్కు…తీరే మార్గం ఏమిటో చెప్పు..!

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

తిరుమల, తిరుచానూరు తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్న ఆలయం శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి‌ ఆలయం. నిత్యం నాలుగైదు వేల మంది; శని‌ – ఆదివారాల్లో దాదాలు పదివేల మంది స్వామిని దర్శించుకుంటున్నారు.

కల్యాణ వేంకటేశ్వర స్వామికి ఇతర మొక్కులతో పాటు తలనీలాల సమర్పించే భక్తులూ ఉన్నారు. మామూలు రోజుల్లో యాభై మంది దాకా; శని – ఆదివారాల్లో వంద మంది దాకా తలనీలాలు సమర్పించే భక్తులు ఉంటారు.

అయితే…శ్రీనివాసమంగాపురంలో తలనీలాలు సమర్పించడానికి‌ అవసరమైన ఏర్పాట్లు మాత్రం లేవు. టిటిడి ఇక్కడ కల్యాణకట్ట ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయివేటు వ్యక్తులు భక్తుల నుంచి తలనీలాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి రెండు వందల దాకా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా…సేకరించిన కురులు స్వామివారికి చేరడం లేదు. దీంతో తమ మొక్కు తీరిందో లేదో కూడా తెలియక భక్తులు సతమతం అవుతున్నారు.

శ్రీనివాసమంగాపురంలో భక్తుని నుంచి తలనీలాలు సేకరిస్తున్న ప్రయివేటు వ్యక్తి

శ్రీనివాసమంగాపురంలో కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు ఉన్నతాధికారులకు గతంలోనే ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఇద్దరు ముగ్గరు క్షురకులను నియమించినా సరిపోతుంది. తలనీలాలు సేకరించడానికి అవసరమైన ఎర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. టిటిడి ఉన్నతాధికారులు స్పందించి శ్రీనివాసమంగాపురంలో కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*