కాంగ్రెస్‌ – టిడిపి పొత్తు కెసిఆర్‌ వ్యూహమా…!

తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న సర్వత్రా సాగుతోంది. ఇప్పటికే పలు సర్వేలు వచ్చినా…ఏవీ విశ్వసించదగ్గవిగా లేవు. పోలింగ్‌ మునిసిన తరువాత వెలువడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల వల్ల కాస్త స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ తరువాత వెలువడే ఫలితాలతో అన్ని ప్రశ్నలకూ సమాధానం లభిస్తుంది.

అన్నింటికంటే….బద్ధశత్రువులైన కాంగ్రెస్‌-టిడిపి పొత్తు ఎటువంటి ఫలితాలను ఇస్తుందనేదానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పొత్తు ఫలించి, టిఆర్‌ఎస్‌ ఘోర ఓటమి చవిచూడబోతోందని కొందరు చెబుతుంటే….ఈ ‘వికృత’ పొత్తు వికటిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఈ అంచనాల సంగతి అలావుంచితే…కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ పొత్తు వెనుక కెసిఆర్‌ వ్యూహం ఉందన్న నమ్మలేని చర్చ కూడా సాగుతోంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ టిఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించింది. కెసిఆర్‌ అంగీకరించకపోవడంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. ఇది బయటకు కనిపిస్తున్నది. అయితే…కెసిఆర్‌ చెప్పడంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌తో ఉంది. టిఆర్‌ఎస్‌కు దగ్గరకావడం లేదు. కాంగ్రెస్‌-టిడిపి పొత్తు పెట్టుకుంటే….చంద్రబాబుపై ఉన్న కోపంతో రెడ్డి సామాజికవర్గం టిఆర్‌ఎస్‌ వైపు వస్తుందన్న నమ్మకంతో కెసిఆర్‌ ఈ వ్యూహం అమలు చేసినట్లు చెబుతున్నారు.

కెసిఆర్‌ వ్యూహం వల్ల కాంగ్రెస-టిడిపి పొత్తు కుదిరిందా లేక ఆ పార్టీలే తమ ప్రయోజనాల కోసం పొత్తుపెట్టుకున్నాయా అనే సంగతి పక్కనపెడితే….ఈ పొత్తు కచ్చితంగా టిఆర్‌ఎస్‌కు మేలు చేసిందన్న అంచనాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌తో అనుబంధంలో ఉన్న రెడ్డి సామాజికవర్గం ఆ పార్టీని విడిచిపెట్టింది. తెలంగాణలో వైసిపి కూడా పోటీలో లేకపోవడంతో…అనివార్యమై టిఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేసింది.

ఈ పొత్తు వల్ల తెలుగుదేశం ఓట్లు కొన్ని వచ్చి కాంగ్రెస్‌ కొంత లాభపడితే పడవచ్చుగానీ….కాంగ్రెస్‌ శాశ్వతంగా రెడ్డి సామాజికవర్గాన్ని కోల్పోయిందన్న తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్నవారు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఫర్వాలేదు….ఆ వర్గం కాంగ్రెస్‌తోనే కొనసాగే అవకాశాలున్నాయి. అదే కాంగ్రెస్‌ ఓడిపోతే …రెడ్డి సమాజిక వర్గం శాశ్వతంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వేరే దారి చూసుకుంటుంది. ఒక విధంగా కాంగ్రెస్‌ భారీ మూల్యాన్నే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*