కాంగ్రెస్‌ మెత్తగా….కెవిపి గరంగరంగా..!

రానున్న ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రద్రేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎట్టుకోడానికి కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. తన బద్ధ శత్రువైన టిడిపి పట్ల కాంగ్రెస్‌ నాయకుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులెవరూ టిడిపిని పెద్దగా విమర్శించడం లేదు. ఇటీవల కర్నూలుకు వచ్చిన ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ కూడా టిడిపిని పళ్లెత్తుమాట అనలేదు. కాంగ్రెస్‌-టిడిపి పొత్తునకు రెండు పార్టీల నాయకులూ మానసికంగా సిద్దపోయారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామంచద్రరావు మాత్రం తెలుగుదేశంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఏకిపారేస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పోరాడుతుంటే…ఏనాడూ ఆయన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ప్రైవేట్‌ బిల్లుకు కూడా సహకరించలేదని మండిపడ్డారు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్‌ మద్దతు కోరడం సిగ్గుచేటని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని…ప్రత్యేక ప్యాకేజీ నాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు…ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలంటూ తీర్మానం చేశారని అన్నారు. తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ లేఖ ద్వారా తెలియజేశారు.

కెవిపి రామచంద్రరావు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్‌ మరణం తరువాత జగన్‌ కాంగ్రెస్‌ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నా కెవిపి మాత్రం కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ప్రైవేట్‌ బిల్లును కెవిపి ప్రవేశపెట్టారు. కెవిపి చెప్పిన దాంట్లో వాస్తముంది. కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పట్టు వదలకుండా పోరాడుతోంది. ఏనాడూ చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వలేదు. పైగా కేసులు పెట్టి ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తానే పోరాడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తోంది. దీన్ని కెవిపి జీర్ణించుకోలేకపోతున్నారు. అంతుకే తన మనసులోని మాటను లేఖ ద్వారా చంద్రబాబుకు తెలియజేశారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్ర నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*