కాంగ్రెస్ తో టిడిపికి పొత్తు వొద్దంటున్న ఏబిఎన్ రాధాకృష్ణ!

తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు టిడిపి ఉవ్విళ్లూరుతుండగా…ఆ పార్టీ నేతల ఆశలపై నీళ్లు చల్లేశారు ఎబిఎన్ రాధాకృష్ణ. ఎబిఎన్ ఛానల్ లో శనివారం రాత్రి ప్రసారమైన వీకెండ్ కామెంట్ చూస్తే కాంగ్రెస్ తో టిడిపి పొత్తు లేనట్లే అనిపిస్తోంది.

కాంగ్రెసు తో పొత్తు పెట్టుకోవడమంటే కష్టాలు కొనితెచ్చుకోవడమే అనేది రాధాకృష్ణ వ్యాఖ్యానం సారాంశం. తెలంగాణలో ఎన్ని పార్టీలతో మహా కూటమి కట్టినా గెలవబోయేది కెసిఆరే అని తేల్చేశారు. కనీసం 80 సీట్లు రావడం ఖాయమని అంచనా వేశారు. టిఆర్ఎస్ ను ఓడించాలనుకోవడం వేరు…ఓడించగల శక్తి ఉందా అనెది వేరు. ఎటూ ఓడిపోయేదానికి మహాకూటమి కట్టి కెసిఆర్ ప్రథమ శత్రువైన కాంగ్రెస్ తో జతకట్టి శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి…మళ్లీ కెసిఆర్ సిఎం అయితే, వచ్చే ఏడాది ఏపిలో జరిగే ఎన్నికల్లో టిడిపికి నష్టం కలిగేలా పనులు చేయరా…అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం అవసరమా అని రాధాకృష్ణ ప్రశ్నలు లేవనెత్తారు.

కేంద్రంలోని బిజెపి ఇద్దరి చంద్రల మధ్య ఉన్న వైరుధ్యాలను ఉపయోగించుకుని‌ లాభపడాలని చూస్తోందని వ్యాఖ్యనించారు. మోడీ, కెసిఆర్, జగన్, పవన్ అంతా కలిసి బాబుపై దాడి చేసే ప్రమాదం ఉందని, ఇంతమందిని ఎదుర్కోవడం బాబుకు సాధ్యమా అన్నారు. అందుకే ఇద్దరు చంద్రులు ఎవరి దారిలో వారు వెళ్లడం మేలని, ఒకరికొకరు ఎదురుపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు.

దీనికి తగినట్లుగానే చంద్రబాబు పొత్తుపై ఎటూ తేల్చకుండా బాగా ఆలోచించుకోండి అని బాబు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెప్పి వచ్చేశారు. మొత్తంగా అర్థం అవుతున్నదేమంటే కాగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకునే లేదనేదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*