కాకుల‌కు ఏమయింది..? ఎందుకు చచ్చిపోతున్నాయి..?

తమిళనాడు రాష్ట్రం రాణిపేట సమీపంలోని ఓ గ్రామంలో కాకులు పదు సంఖ్యలో చచ్చిపోతున్నట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. కరోనా నేపథ్యంలో అక్కడి జనం హడలిపోతున్నారు. పక్షుల‌కూ కరోనా సోకుతుందా అనే భయం వారిలో ఆందోళన కలిగిస్తోంది.

ఈ అంశంపై కాస్త లోతుగా అధ్యయనం చేస్తే…మార్చి నెల‌లో చాలాచోట్ల కాకులు, ఇతర పక్షులు ఇదేవిధంగా చనిపోతున్నట్లు మీడియా రిపోర్టున్నాయి. కేరళ, కర్నాటక, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ కాకులు చనిపోయినట్లు వార్తలు కనిపించాయి. కొన్నిచోట్ల వందల‌ సంఖ్యలో పక్షులు చచ్చిపోయాయి.

అన్నిచోట్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అకే అనుమానం వ్యక్తం చేశారు. పక్షుల్లో వచ్చే బర్డ్‌ ఫ్లూ వ్యాధి వల్లే కాకులు, ఇతర పక్షులు చనిపోయివుండొచ్చని చెప్పారు. అన్నిచోట్లా చనిపోయిన కాకుల‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. కాకుల్లో బర్డ్‌ ఫ్లూ ఉన్నట్లు కొన్ని నమూనాల్లో తేలింది.

తమిళనాడులో కాకుల‌ చావుకూ బర్డ్‌ఫ్లూ కారణమైతే ఆందోళన కలిగించే అంశమే. బర్డ్‌ఫ్లూ పక్షుల‌ నుంచి మనుషుకూ సోకే ప్రమాదం ఉంది. కొన్నేళ్ల క్రితం ఫారం కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో క్షలాది కోళ్లను భూమిలో పాతిపెట్టిన సంగతి తెలిసిందే. కాకుల‌ ద్వారా బర్డ్‌ ఫ్లూ….ఇంట్లో పెంచుకునే కోళ్లు వంటి పక్షుకు వస్తే అది మరో ఉపద్రవంగా పరిణమించే ప్రమాదం ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*