కాలాపై విశిష్ట‌మైన విశ్లేష‌ణ‌!

దక్షిణ భారత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నంతగా తెలుగువారిని ఆకట్టుకోలేకపోయింది. తమిళనాడు నుంచి వస్తున్న సమీక్షలకు, తెలుగునాట వెలువడిన సమీక్షలకు చాలా తేడావుంది. తమిళంలో కాలాను ఒక సామాజిక కోణంలో తీసిన సినిమాగా చూస్తుంటే….తెలుగు ప్రేక్షకులు మాత్రం అన్ని సినిమాలాగే రజనీ హీరోయిజం కోణంలో మాత్రమే చూశారు. అందుకే….తెలుగుకు, తమిళంకు మధ్య అంతే వైరుధ్యాలతో కూడిన సమీక్షలు వచ్చాయి. సాక్షిలో సీనియర్‌ జర్నలిస్టు జిఎన్‌ సుధీర్‌ రాసిన వ్యాసం కాలా సినిమా విశిష్టతను వెల్లడిస్తోంది. త‌మిళ‌నాట ఉన్న సామాజిక చైత‌న్యం, సినిమా త‌మిళ నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం వ‌ల్ల‌నేమో…త‌మిళ ప్రేక్ష‌కునికి అర్థ‌మైన‌ట్లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థంకాలేదేమో అనిపిస్తుంది. అందుకే కాలాను సామాజిక కోణంలో అర్థం చేసుకోడానికి….సాక్షిలో వ‌చ్చిన క‌థ‌నంలోని కొన్ని ముఖ్య‌మైన భాగాల‌ను ఇక్క‌డ ఇస్తున్నాం. చ‌ద‌వండి. ఆ కోణంలో సినిమా గురించి ఆలోచించండి…..

భారత సినిమా చరిత్రలో సాధారణమైనదేగాక చెప్పు కోదగినది కిందటి వారం. జూన్‌ 7న రజనీకాంత్‌ నటించిన కాలా విడుదలైంది. 1980ల నేపథ్యంతో నిర్మించిన ఈ సినిమాలో మురికి వాడలో నివసించే సామాన్యుడు ప్రజానాయకుడవు తాడు. అంతే కాదు, పేదల ఇళ్లను కూల్చడానికి ప్రయత్నించిన బలవంతుడైన ఓ రాజకీయ నేతను ప్రతిఘటిస్తాడు. ఇది మామూలు విషయం. ఈ కథలో కొత్తేమీ లేదు. అయితే, రజనీకాంత్‌ స్థాయి సూపర్‌స్టార్‌తో దర్శకుడు పా రంజిత్‌ ఓ దళితుడి వేషం వేయించడం, తమిళ వాణిజ్య సినిమాలో దళి తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే. కుల వివక్షను సినిమాల్లో చూపించడం సామాన్య విషయం కాదు.

కాలా కథ సాధారణమైనదేగాని పెద్దగా పట్టించుకోని కింది కులాల జీవనాన్ని చక్కగా చూపించడం, అందుకు రజనీకాంత్‌ నటన దోహదం చేయడం వల్ల ఇది విశిష్ట చిత్రంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సిని మాల్లో దళితులకు ప్రాధాన్యం ఉండదు. సహాయ పాత్రలకే వారు పరిమితమౌతారు. ఆస్కార్‌ అవా ర్డుకు ప్రతి పాదించిన ఆమిర్‌ఖాన్‌ చిత్రం లగాన్‌లో దళితుడైన కచ్రా పాత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆమిర్‌ పాత్రను గొప్పగా చూపించ డానికి అంటరాని వాడైన కచ్రాను వాడుకున్నారు. అంతేగాని, స్వాతంత్య్రానికి ముందు దేశంలో దళి తుల స్థితిపై ఎలాంటి వ్యాఖ్య ఇందులో కనిపించదు.

కాలాలో శక్తిమంతుడైన బ్రాహ్మణుడిపై పోరాటాన్ని అంబేడ్కర్, బుద్ధుడి అభిమాని అయిన రంజిత్‌ 70 ఎంఎంలో గొప్పగా చిత్రించారు. అందుకే కాలాను ఓ మైలురాయి సినిమాగా పిలుస్తాను. హరిదేవ్‌ అభ యంకర్‌ అనే దుష్ట బ్రాహ్మణ పాత్ర పోషించిన నానా పటేకర్‌ రజనీకాంత్‌ పేరు కాలాను ఎగతాళి చేస్తూ, ఇదో పేరేనా అని ప్రశ్నిస్తాడు. కాలా నివసించే ముంబై మురికివాడ ధారావీని ‘అభివృద్ధి’ చేయడా నికి ప్రయత్నించిన సంస్థకు ‘మనూ రియాలిటీ’ అని పేరు పెట్టడంలో పరమార్థం ప్రేక్షకునికి అర్థంకాక పోదు. ఈ మురికివాడలో అపరిశుభ్రతపై పటేకర్‌ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. తన వాడలోని మురికి పరిస్థితులను చూపి గర్వపడతాడు రజనీ. కింది కులాలంటే జుగుప్స ప్రదర్శించే వారిని ప్రతిబింబిం చేలా నానా పటేకర్‌ పాత్రను రంజిత్‌ రూపొందిం చారు. నేరుగా కులం పేరు ప్రస్తావించకుండా శుభత్ర, పేర్లు, దుస్తుల గురించి మాట్లాడుతూ కింది కులాలపై పైవారి మనస్సుల్లో అసహ్యం ఎంతగా ఉంటుందో కాలా చక్కగా చూపిస్తుంది.

రంజిత్‌ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి. దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్‌ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు.

దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్‌ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు.

ఇప్పుడు రజనీకాంత్‌ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కాని, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బల మైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. తమిళ సినీ ప్రేక్షక ప్రపం చంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజికవర్గాల కథలు సినిమాలకు ఇతివృత్తాలుగా మారడానికి కాలా దోహ దం చేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*