‘కాళికామాత’నే చంపేశారు!

అసహనం, కిరాతకం ఎంతగా ప్రబలుతోందో వెల్లడించే ఉదంతం ఇది. కాళికాదేవి మాత వేషం ధరించిన వ్యక్తిని కొందరు యువకులు అకారణంగా చంపేశారు. నేను కాళికామాతను నన్ను వేధిస్తే మాత ఊరుకోదు అన్నందుకు….నీ మాతను వచ్చి నిన్ను కాపాడమను చూద్దాం అనే ధోరణితో అతన్ని చంపేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే….

ధర్మశాలకు వెందుకు కలిపి అనే వ్యక్తి కాళికాదేవి వేషం ధరించెవాడు.

ఒంటరి అయిన కలూ తరచూ హిజ్రాలతో కలిసి కాళి మాతను పూజించేవాడు. ఈ క్రమంలో అతను తనను తాను దేవతగా భావించుకునేవాడని వారు చెప్పారు. గత మంగళవారం పూజ పూర్తయ్యాక కాళి మాత వేషాధారణతో ఆశ్రమం విడిచివెళ్లాడని, ఆ తర్వాత తిరిగి రాలేదని వారు చెప్పారు. ఆపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న కొందరు పిల్లలు పోలీసులతో ఆరోజు జరిగింది వివరించారు. కాళిమాత వేషం వేసుకున్న కలూను కొందరు వ్యక్తులు అడ్డగించి వేధించారని, చిన్నపాటి గొడవ కూడా జరిగిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

కాళిమాత వేషాధారణలో ఉన్న కలూను నిందితుల కంటపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న వాళ్లంతా కలూ చున్నీ లాగుతూ వేధించారు. కోపంతో కలూ.. తాను దైవాంశాన్ని అని, ఎగతాళి చేస్తే చచ్చిపోతారని వాళ్లతో చెప్పాడు. దీంతో వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. బలవంతంగా కలూను అటవీలోకి లాక్కెల్లారు. ఆపై పిడిగుద్దులతో దాడి చేసి అనంతరం, రాళ్లు, తమ వెంట ఉన్న కత్తులతో అతన్ని చిత్రవధ చేసి మరీ చంపారు. మిగతా నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు, జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా పాతికేళ్లలోపు వాళ్లే కాగా.. వారిలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*