కియాపై ‘కారు కూతలు’..! అది ఫ్యాక్ట‌రీనా…. షామియానా…. తీసుకెళ్లిపోడానికి…!

అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందంటూ తెలుగుదేశం అనుకూ మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. రాయటర్స్‌ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ రాసిన ఓ కథనాన్ని ఆసరా చేసుకుని ఈ రాద్ధాంతమంతా సాగుతోంది. అటువంటిదేమీ లేదని కియా కంపెనీ స్వయంగా చెబుతున్నా పట్టించుకోకుండా కియా తరలిపోతోందన్న ప్రచారాన్ని సాగిస్తూనే ఉంది పసుపు మీడియా. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న తుగ్లక్‌ నిర్ణయాకు భయపడి కియా తరలిపోవడానికి సిద్ధమయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మావాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాని వైసిపి నేతలు బెదరిస్తున్నారట…కియా వెళ్లిపోవానుకోడానికి అదీ ఒక కారణమట. ఈమాట కూడా చంద్రబాబు నాయుడే చెప్పారు.

కియా ఉంటుందా వెళుతుందా అనేది చెప్పడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. చిన్నతర్కం చాలు. పది వేల‌ కోట్ల పెట్టుబడితో కియా కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. ఇప్పుడు ఉత్పత్తి కూడా మొదయింది. ఇక్కడి నుంచే విదేశాల‌కూ కియా కార్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ దశలో పరిశ్రమను తమిళనాడుకు తరలించడం సాధ్యమా…అనేది ప్రశ్న. అదేమి పెళ్లిళ్లకు….పంక్షన్లకు వేసే షామియానా టెంటా ఎప్పుడంటే అప్పుడు విప్పునుకుని తరలించుకుపోవడానికి…? ఒక బహుళజాతి సంస్థ పరిశ్రమ పెట్టిన తరువాత నెల‌ల‌ వ్యవధిలో మూసేసుకుని వెళ్లిపోయిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం మారినా, ఎటువంటి విధానాలు వచ్చినా….అన్నింటికీ సిద్ధపడే పెట్టుబడు పెడతాయి. అంతేతప్పు ఎవరో బెదిరిస్తేనో, ఇబ్బందిపెడితేనో బహుళజాతి సంస్థలు గుడారాలు పీక్కుకుని వెళ్లిపోవు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాయి. సమస్యను పరిష్కరించుకుంటాయి. అంతేగానీ భయపడి పారిపోవు.

ఇక కియా ఎందుకు వెళ్లిపోవాని అనుకుంటోందంటే…తమవారికే ఉద్యోగాలు ఇవ్వాని వైసిపి నేతు బెదిరిస్తున్నారట. ఇక్కడ కాస్త వివరంగా చెప్పాల్సిన విషయం ఏమంటే…పరిశ్రమల్లో స్థానికుకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయమని వైసిపి నేతలో, ప్రభుత్వ పెద్దలో కియాపై ఒత్తిడి తెచ్చివుంటే…. దాన్ని తప్పుపట్టలేం. ఇంకా చెప్పాంటే….అభినందించాలి. పరిశ్రమకు ప్రభుత్వం భూములు, ఇతర రాయితీలు ఇచ్చేది ఎందుకు…? పరిశ్రమ వస్తే స్థానికంగా పది మందికి ఉపాధి భిస్తుందన్న ఆశతో. స్థానికుకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెబితే…ఇక ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఏమి ప్రయోజనం? స్థానికుల‌కు ఉద్యోగాల‌కు అవసరమైన నైపుణ్యత లేకుంటే….శిక్షణ ఇప్పించి పనిలోకి తీసుకోవాలి. భూమము, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం…స్థానికుకు ఉద్యోగాలు ఇప్పించడంలో రాజీపడుతుంటే…ప్రతిపక్షం నిదీయాలి. అంతేతప్ప….స్థానికుకు ఉద్యోగాలు ఇవ్వమన్నందుకు ప్రభుత్వాన్ని తప్పుబట్టడం బాధ్యత అనిపించుకోదు.

తిరుపతి సమీపంలో శ్రీసిటీ పేరుతో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటయింది. ఇందులో పదుల‌ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో విదేశీ పరిశ్రమలూ ఉన్నాయి. శ్రీసిటీ దేశంలోనే విజయవంతమైన సెజ్‌ అయినప్పటికీ…. స్థానికుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నది శ్రీసిటీపై ఉన్న ఆరోపణు ఉన్నాయి. చెన్నై నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు. దీనిపైన రాయసీమ ప్రజాసంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయినా మొన్నటిదాకా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పట్టించుకున్న పాపానపోలేదు. ముఖ్యమంత్రిగా ఆయన గట్టిగా ఒత్తిడి తెచ్చివుంటే…కంపెనీలు స్థానికుకు ఉద్యోగాలు ఇచ్చివుండేవి. స్థానికు జీవితాల్లో వెలుగు నిండేది. ఒక ప్రాంతంలోని వన‌రుల‌ను వినియోగించుకుని లాభాలు గడిరచానుకునే పరిశ్రమ….అక్కడి వారికి ఉద్యోగాు ఇవ్వడానికి నిరాకరిస్తే అంగీకరించాల్సిన అవసరం లేదు. అటువంటి పరిశ్రమ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.

మళ్లీ కియా మోటార్స్‌ విషయానికొస్తే…ఇంకా పూర్తిస్థాయిలో విస్తరణ జరగలేదు. పది వేల మంది దాకా పని చేయాల్సిన చోట మూడు వేల‌ మంది పని చేస్తున్నట్లు చెబుతున్నారు. స్థానికుల‌కూ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారని వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కియాను ఇబ్బంది పెట్టడానికి ఏముంటుంది? రాయటర్‌ రాసిన కథనంలోగానీ, టిడిపి నేతలు చెబుతున్న మాటల్లోగానీ….కియా ఇక్కడి నుంచి తరలిపోడానికి బమైన కారణాలేవీ కనిపించడం లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి…ప్రతిపక్షం ప్రయోగించిన ఇకసు, ఇంగ్లీషు, రాజధాని అంశాల్లాగే కియా కూడా ఒకటని అనుకోవాలి. అంత‌కు మించి ఏమీ లేదు.

…..ఆదిమూం శేఖర్‌, సంపాదకు, ధర్మచక్రం

1 Comment

  1. వాళ్లు కాస్తో కూస్తో ఉన్న మర్యాద కూడా పోగొట్టుకుంటారు అంతే సార్

Leave a Reply

Your email address will not be published.


*