కుక్కకేమి తెలుసు…ఆయన ఎస్‌పి అని..!

ఆది ఆసక్తికరమైన వార్త. ఓ పోలీస్‌ సూపరింటెండెంట్‌ (ఎప్‌సి) కుక్కుకు మెడల్‌ అందిస్తుంటే….ఆయన తనకు మెడల్‌ అందించడానికి వచ్చిన అతిథి, అందులోనూ పోలీసు అధికారి అని కూడా లేకుండా ఆయన్నే కరిచిందట. తమిళనాడులోని ఊటీలో రెండు రోజుల పాటు డాగ్‌ షో – శునకాల పోటీ నిర్వహించారు. ఇందులో 300కుపైగా శునకాలు పాల్గొన్నాయి. ఈ పోటీలో రెండో స్థానాన్ని దక్కించుకున్న బింగి అనే జాగిలానికి మెడల్‌ మెడలో వేస్తున్న సమయంలో ఎస్‌పి గారి చేతిని గబాలున పట్టుకుందట. వెంటనే ఎస్‌పిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారట. కనకపు సింహాసనపున ‘శునకమును కూర్చుండబెట్టిన….వెనుకటి గుణమేల మాను..’ అని శతకకారుడు ఎప్పుడో చెప్పనే చెప్పారు. కాబట్టి…ఆ శునకాన్ని అని లాభంలేదు. అయినా ఇప్పుడు కేసు పెట్టాలంటే…శునకంపైన పెట్టాలా…లేక దాని యజమానిపైన పెట్టాలా?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*