కెమెరాలున్నాయని మరచి ప్రేమలోకంలో విహరించిన సామ్రాట్ – తేజస్వీ

బిగ్ బాస్ ఇంట్లో మంగళవారం రాత్రి మొదలైన లవర్స్ టాస్క్ ను బుధవారానికి కాస్త రక్తికట్టిచ్చారు బిస్ బాస్. సామ్రాట్- తేజస్వినీ జంట తమ చుట్టూ 70 కెమెరాలు ఉన్నాయని, తమను కోట్ల కన్నులు చూస్తున్నాయని మరచిపోయి ప్రేమ లోకంలో మునిగిపోయారు. ప్రేమికులు సెక్యూరిటీ నుంచి తప్పించుకుని గార్డెన్ ఏరియాలోకి వేళ్లాలని, అక్కడ ప్రేమ కబుర్లు చెప్పుకోవాలని, పాటకు నృత్యం చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. ముందుగా సామ్రాట్ – తేజస్వీ జంట గార్డెన్ ఏరియాలోకి వెళ్లింది. అక్కడ నుంచి సుందరంగా అలంకరించిన యాక్టివిటీ‌ ఏరియాలోకి వెళ్లారు. తేజస్వినీ ప్రేమ తన్మయత్వంలో మాట్లాడింది. జీవితంలో ఎమికావాలన్నా తన వద్దకు రావచ్చని సామ్రాట్ ను ఆహ్వానించింది. తమ ఇద్దరి మధ్య బలమైన బంధం ఏదో ఏర్పడిందని ఇద్దరూ బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకున్నారు. ఇయటకు వెళ్లిన తరువాత కూడా జీవితాంతం ఫ్రెండ్స్ గా కలిసివుండాలని సామ్రాట్ చెప్పాడు. 1970 దశకం నాటి హీరో హీరోయిన్లు మాదిరి డ్రెస్ చేసుకున్న ఆ జంట…రావోయి చందమామ మా ఇంట గాథ వినుమా…పాటకు పరవశిస్తూ డాన్స్ చేశారు.

ఇందులో బిగ్ బాస్ స్ర్కిప్ట్ కొంత ఉంది.‌ ఇద్దరూ పాతతరం హీరో హీరోయిన్లు మాదిరి డ్రెస్ చేసుకోవడం, ఆ ఇద్దరే ముందుగా యాక్టివిటీ ఏరియాకు వెళ్లడం, అసలు ఆ ఇద్దరినే ప్రేమ జంటగా ఎంపిక చేయడం ఇవన్నీ ముందుగా సిద్ధం చేసిన స్ర్కిప్ట్ ప్రకారం జరిగిట్లు అనిపించినా… సామ్రాట్- తేజస్వీ ప్రవర్తన మాత్రం వాస్తవికంగా అనిపిస్తోంది. వాళ్ల సంభాషణలు ఏదో తెలియని బంధంతో తన్నుకొచ్చిన భావోద్వేగం నుంచి వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. షో ముగిసే లోపు ఈ బంధం ఎటుదారితీస్తుందో చాడాలి.‌

బిగ్ బాస్ ఇంటిలో ఉన్నన్ని రోజులు బయటి ప్రపంచం ఏదీ పట్టదు. అదే ప్రపంచంలా అనిపిస్తుంటుంది.‌ అనుబం ధాలకైనా విభేదాలకైనా అక్కడున్న మనుషులతోనే అనిపిస్తుంది. సామ్రాట్..తేజస్వినీ మధ్య బంధానికి ఈ మానసుక స్థితే కారణమనిపిస్తోంది. ఇదలావుంచితే బుధవారం నాటి ఎపిషోడ్ లో చివరి ఇరవై నిమిషాలు తప్ప మిగతా అంతా బోర్ గానే సాగింది. ఇంకో విషయం ఏమంటే సాధారణంగా ఉదయాన్నే హుషారైన పాటతో ఇంటి సభ్యులను నిద్రలేపే బిగ్ బాస్ ఈ రోజు మాత్రం మనసుకు హత్తుకునే ఎమోషనల్ మ్యూజిక్ మాత్రమే ప్లే చేశారు. దీన్ని విన్న సభ్యులు ఏదో ఆలోచనలో పడిపోయారు. రోల్ రైడా ఏడ్చేశారు. ఆ సంగీతం తనలోని నిశ్శబ్దాన్ని బద్ధలుకొట్టిందని, అందుకే కన్నీళ్లు ఆపుకోలేకపోయానని రైడా చెప్పారు.‌ నిజంగానే ఆ సంగీతం బాగుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*